
ఆగ్నేయాసియాలోని అందమైన దేశమైన థాయిలాండ్. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. చాలా మంది శారీరక సంతృప్తి కోసం ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో.. ఈ దేశం మరింత అందంగా, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇప్పుడు థాయిలాండ్ లో మరొకటి ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ సమస్య కొత్త చర్చకు దారితీసింది. థాయిలాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో అద్దె భార్యలు దొరుకుతారు. కొంత మంది మహిళలు పర్యాటకులతో భార్య వంటి తాత్కాలిక సంబంధాలను కలిగి ఉంటారు. ఈ స్త్రీని లేదా అమ్మాయిని పర్యాటకుడు కాలక్రమంలో ఇష్టపడితే వారు వివాహం చేసుకోవచ్చు.
థాయిలాండ్‌లో సరోగసి భార్య
ఈ వింత ధోరణి థాయిలాండ్‌లోని పట్టాయాలో చాలా కాలంగా ఆచరించబడుతోంది. ఇది ఒక రకమైన తాత్కాలిక వివాహం లాంటి సంబంధం, దీనిలో ఒక పురుషుడు డబ్బు ఇచ్చి స్వల్ప కాలం స్త్రీని భార్యని చేసుకుంటాడు. స్త్రీ భార్యగా అన్ని పనులు చేస్తుంది. ఆమె వంట చేయడం, బయటకు భర్తతో వెళ్లడం వంటి ప్రతిదాన్ని చేస్తుంది. ఒక కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ఒప్పందం ప్రకారం జరుగుతుంది. చట్టబద్ధమైన వివాహంగా పరిగణించబడదు.
రచయిత లావర్ట్ ఇమ్మాన్యుయెల్.. థాయ్ డేబూ: ద రైస్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడరన్ సొసైటీ” అనే పుస్తకంలో ఈ ట్రెండ్ గురించి వెల్లడించారు. ఈ ధోరణి థాయిలాండ్‌లోని పేదరికం నుంచి మొదలైంది. మహిళలు డబ్బు సంపాదించడానికి, తమ కుటుంబాలను పోషించడానికి ఈ పనిని మొదలు పెట్టారు. మహిళలు సాధారణంగా బార్‌లు లేదా నైట్‌క్లబ్‌లలో పని చేస్తారు. అక్కడ వారు కొంతమంది పురుషులను ఆకర్షిస్తారు. కస్టమర్లను పొందుతారు.
అద్దెకు భార్యలుగా మారే మహిళల ధర వయస్సు, అందం, విద్య , కాల వ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలను కొన్ని రోజులకే భార్య. మరికొందరు నెలల తరబడి ఉంటారు. నివేదికల ప్రకారం అద్దె మొత్తం $1,600 నుంచి $1,16,000 (మన దేశ కరెన్సీ లో సుమారు ₹1.4 లక్షల నుంచి ₹1 కోటి) వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేదు. కనుక ప్రతిదీ ప్రైవేట్ ఒప్పందం కింద జరుగుతుంది. భార్యను అద్దెకు తీసుకునే ఈ పద్ధతి థాయిలాండ్‌లో కొత్తది. అయితే జపాన్, కొరియా వంటి దేశాలలో ఇప్పటికే ఈ ట్రెండ్ ఉంది. ‘గర్ల్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ వంటి సేవలు ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నాయి. థాయిలాండ్ కూడా దీని నుంచే ప్రేరణ పొందింది.
థాయిలాండ్ ప్రభుత్వం కూడా ఈ పరిణామం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాపారంలో పనిచేసే మహిళల భద్రత, హక్కులను కాపాడటానికి దీనిని నియంత్రించడానికి చట్టాలను రూపొందించడం ఇప్పుడు అవసరం. మొత్తంమీద, థాయిలాండ్‌లో అద్దెకు భార్యలు ట్రెండ్ కేవలం తాత్కాలిక సంబంధం మాత్రమే కాదు.. పెద్ద వ్యాపారం. దీని కారణంగా చాలా మంది మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. అయితే
సమాజం, నైతికత గురించి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..