Watch Video: ఐడియా అదుర్స్.. కంటైనర్‌లో మ్యారేజ్ హాల్.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నారంటే..?
సామాన్యుల అసాధారణ విజయాలను ప్రపంచానికి పరిచయంచేసే మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కదిలే ఏసీ కల్యాణ మండపం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Portable Marriage Hall: ఆనంద్ మహీంద్రా.. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా, ఆయన కళ్లు ఎప్పుడూ కొత్తదనాన్ని వెదుకుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra).. టాలెంట్‌ను వెదికిపట్టుకుని మరీ అభినందించడం ఆయన స్టైల్.. సామాన్యుల అసాధారణ విజయాలను ప్రపంచానికి పరిచయంచేసే మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కదిలే ఏసీ కల్యాణ మండపం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కదిలే మ్యారెజ్ హాల్‌ను చూసిన ఆనంద్ మహింద్రా వెంటనే దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. కంటైనర్‌ను కదిలే ఏసీ ఫంక్షన్ హాల్‌గా మార్చిన నిర్వాహకులను అభినందించారు. వినూత్న ఆలోచన, కొత్తదనం చూపిస్తూ రూపొందించిన మూవింగ్ ఫంక్షన్ హాల్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తిని తాను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు ఆనంద్ మహీంద్రా. ఇది ఆలోచనాత్మకంగా ఉందని.. మారుమూల ప్రాంతాలకు ఇలాంటి సౌకర్యాన్ని అందించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైనది.. జనాభా-సాంద్రత కలిగిన దేశంలో ఇలాంటి సేవలు అవసరం అంటూ ట్విట్ చేశారు.
రెగ్యులర్ ఫంక్షన్ హాల్స్ తరహాలోనే 12వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఏసీ హాల్‌ను తీర్చిదిద్దారు నిర్వాహకులు. 40 అడుగులు పొడవు ఉండే ఈ కంటైనర్‌ను ఫోల్డ్ చేసేవిధంగా స్ట్రాంగ్ మెటీరియల్‌తో రూపొందించారు. ఈ ఫోల్డింగ్స్‌ను ఓపెన్ చేస్తే మరో 30 అడుగుల విస్తీర్ణం పెరిగేలా తయారు చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో 200మంది దర్జాగా కూర్చొని కార్యక్రమం నిర్వహించుకునేలా డిజైన్ చేశారు. ఇంకా సౌండ్ సిస్టమ్, జనరేటర్స్, లైట్స్ అండ్ స్టేజ్, స్టైలిష్ డెకరేషన్ అండ్ కేటరింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ కలిపి 50వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ మూవింగ్ ఫంక్షన్ హాల్ చూసిన నెటిజన్లు దానికి ఫిదా అవుతున్నారు.
రెండు నిమిషాల వైరల్ వీడియో భారీ ట్రక్‌తో ప్రారంభమవుతుంది.. అనంతరం ఆధునిక, అందమైన పెళ్లి మండపంగా మారుతుంది. హాలులో సొగసైన లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, ఫర్నీచర్ కూడా ఉంది. ఒకసారి మీరు కూడా వీడియోపై లుక్కెయండి..
వీడియో చూడండి..
I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810
— anand mahindra (@anandmahindra) September 25, 2022
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు దాదాపు 7 లక్షల వీక్షణలు వచ్చాయి. వేలాది మంది దీనిని లైక్ చేసి.. పోస్ట్‌ను రీ-ట్వీట్ చేస్తున్నారు. ఈ ఆలోచనను అభినందించడమే కాకుండా నిర్వాహకులను కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు. అద్భుతంగా ఉందని.. వినూత్నంగా రిసెప్షన్‌ను నిర్వహించడంలో ప్రజలకు సహాయపడుతుంది.. ఇంకా ఖర్చులను కూడా ఆదా చేస్తుందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..