AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్‌ చిచా.. ప్రతిభావంతులకు కొదువే లేదనడానికి ఈ వీడియోనే సాక్ష్యం..

Viral Video: ట్యాలెంట్‌ ఎవడి సొత్తు కాదంటారు. ఎంతో మంది ప్రతిభ ప్రపంచానికి తెలియకుండానే మరుగున పడుతుంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి...

Viral Video: వారెవ్వా.. ఏం ట్యాలెంట్‌ చిచా.. ప్రతిభావంతులకు కొదువే లేదనడానికి ఈ వీడియోనే సాక్ష్యం..
Narender Vaitla
|

Updated on: Jul 19, 2022 | 6:55 AM

Share

Viral Video: ట్యాలెంట్‌ ఎవడి సొత్తు కాదంటారు. ఎంతో మంది ప్రతిభ ప్రపంచానికి తెలియకుండానే మరుగున పడుతుంటుంది. అయితే ఇది ఒకప్పటి మాట ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతిభ ప్రపంచానికి ఇట్టే పరిచయం అవుతుంది. స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో తీసి ఒక్క పోస్ట్ చేస్తే చాలు దునియా మొత్తం చక్కర్లు కొడుతోంది. ఇలా ఎంతో మంది అసమాన ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఆసక్తికరంగా ఉండే వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకునే వారిలో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర మొదటి వరుసలో ఉంటారు.

నిత్యం ఏదో ఒక వీడియోను ట్వీట్ చేసే ఆనంద్‌.. తాజాగా మరో ఆసక్తికర వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో ఓ బిల్డింగ్‌ గోడకు అనుకొని ఐరన్‌ రాడ్లతో చేసిన ఓ నిర్మాణం ఉంది. దానికి మొదట్లో చిన్న లాక్‌ లాంటిది ఒకటి ఉంది. అనంతరం ఓ వ్యక్తి ఆ లాక్‌ను ఓపెన్‌ చేయగానే గోడకు అనుకొని ఉన్నట్లున్న ఐరన్‌ రాడ్లు మెట్లలాగా మారిపోయాయి. మెట్లు ఎక్కి, కిందికి దిగి మళ్లీ రాడ్లను గోడకు అనిచ్చి లాక్‌ వేసేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఆ కంట ఈ కంట పడి ఆనంద్‌ మహీంద్ర దృష్టిని ఆకర్షించింది. వెంటనే ట్వీట్ చేస్తూ.. ‘చూడడానికి సింపుల్‌గా కనిపిస్తున్నా ఎంతో క్రియేటివ్‌గా ఉంది. స్థలాన్ని మిగిలించడమే కాకుండా, గోడపై మంచి డిజైన్‌లా కూడా ఉంది. ఇది చూసిన తర్వాత స్కాండనేవియన్ డిజైనర్లు కూడా ఈర్ష్య పడాల్సిందే’ అని రాసుకొచ్చారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వాట్సాప్‌లో తనకు వచ్చిందని తెలిపారు ఆనంద్ మహీంద్ర. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ మెట్లను తయారు చేసిన వారి ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?