AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనదేశ ప్రజల సమస్యపై గొంతువిప్పిన అమెరికన్ యూట్యూబర్.. మురికి వాడకు చేరుకున్న యువకుడు.. వీడియో వైరల్

గత కొన్ని సంవత్సరాలుగా అవకాశం దొరికినప్పుడల్లా  విదేశీయులు భారతీయ ప్రజల పేదరికం గురించి ప్రస్తావిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆ విదేశీయుల మాటల కంటే భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక అమెరికన్ యూట్యూబర్ దేశ రాజధాని ఢిల్లీలోని పేద మురికివాడలోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో నివసించే ప్రజల రోజువారీ జీవితం గురించి తెలుసుకున్నాడు. అక్కడ నివసిస్తున్న పేదవారి దుస్తితిని పది మంది ముందుకు తీసుకుని వచ్చాడు.

మనదేశ ప్రజల సమస్యపై గొంతువిప్పిన అమెరికన్ యూట్యూబర్.. మురికి వాడకు చేరుకున్న యువకుడు.. వీడియో వైరల్
Viral VideoImage Credit source: Youtube
Surya Kala
|

Updated on: Oct 13, 2024 | 12:48 PM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఫేమస్ కావాలనే కోరిక ఎక్కువగా ఉంది. అందుకోసం కోసం, కంటెంట్ సృష్టికర్తలు ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజూ కొత్త రకాల కంటెంట్ మన ముందుకు రావడానికి ఇదే కారణం. కొన్ని రకాల వీడియోలను రీల్స్ ను ప్రజలు చూడటమే కాకుండా ఒకరికొకరు విస్తృతంగా పంచుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక అమెరికన్ యూట్యూబర్ కంటెంట్ కోసం భారతదేశంలోని మురికివాడల నివాసితుల మధ్యకు వెళ్లి అక్కడ దృశ్యాలను తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ మురికి వాడల్లోని జనాలు ఆయనను పొగడటం ప్రారంభించారు.

గత కొన్ని సంవత్సరాలుగా అవకాశం దొరికినప్పుడల్లా  విదేశీయులు భారతీయ ప్రజల పేదరికం గురించి ప్రస్తావిస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆ విదేశీయుల మాటల కంటే భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక అమెరికన్ యూట్యూబర్ దేశ రాజధాని ఢిల్లీలోని పేద మురికివాడలోకి ప్రవేశించి ఆ ప్రాంతంలో నివసించే ప్రజల రోజువారీ జీవితం గురించి తెలుసుకున్నాడు. అక్కడ నివసిస్తున్న పేదవారి దుస్తితిని పది మంది ముందుకు తీసుకుని వచ్చాడు. ఇది చూసిన తర్వాత అందరూ ఆ విదేశీయుడు చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి మురికివాడలో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. నీరు, బాత్రూమ్ (టాయిలెట్) వంటి కనీస సౌకర్యాలు కూడా పొందలేకపోతున్నారని ప్రజలు చెప్పారు. క్రిష్ తాను చూసిన సమస్యలను నెటిజన్ల దృష్టికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని, వారిని అక్కడ ఉన్న సమస్యల నుండి బయటపడేయాలని, తద్వారా వారు ప్రాథమిక సౌకర్యాలను కూడా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.

యూట్యూబ్‌లో ఈ వీడియోను షేర్ చేసి.. క్రిష్ ఈ వీడియోలో తాను న్యూ ఢిల్లీలోని అత్యంత మురికివాడకు చేరుకున్నానని పేర్కొన్నాడు. ఆ ప్రాంతం కుసుంపూర్ పహారీ. ఇక్కడ వీధి ప్రజలు నీటి సరఫరాపై ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని ప్రజలు బాత్రూమ్ సౌకర్యం లేదు. అక్కడ బాత్రూమ్ ఉండడం అంటే ఒక విలాసవంతమైన సమస్యగా లెక్క. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ యూట్యూబర్‌ని మెచ్చుకున్నారు. ఒకరు ఇలా వ్రాశారు.. ధన్యవాదాలు క్రిస్.. ఇది చాలా ప్రోత్సాహకరమైన వీడియో.. అంతేకాదు పాలకుల కళ్ళు తెరపించే వీడియో. మరొకరు ఇలా రాశారు, ‘మీరు నా దేశం గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు భారతీయుడిగా నేను చాలా సంతోషిస్తున్నా అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..