AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యమునా నది ఏడుస్తోంది.. ఎందుకో తెలుసా? అక్బర్‌ను మెప్పించిన బీర్బల్ చతురత!

అక్బర్ బాద్‌షా దర్బార్‌లో బీర్బల్ చాకచక్యానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఎవరూ ఊహించని ప్రశ్నలకు కూడా బీర్బల్ తన తెలివితేటలు, భావనాశక్తితో అద్భుతమైన సమాధానాలు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే అక్బర్‌ను వెంటాడిన ఒక పెద్ద సందేహానికి బీర్బల్‌ అత్యంత చాకచక్యంగా సమాధానం ఇచ్చి మెప్పించిన కథలు అనేకం ఉన్నాయి. అటువంటి ఒక మనసును తాకే ఆసక్తికరమైన కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యమునా నది ఏడుస్తోంది.. ఎందుకో తెలుసా? అక్బర్‌ను మెప్పించిన బీర్బల్ చతురత!
Why Was Yamuna CryingImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 29, 2026 | 2:05 PM

Share

మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ తన చతురతతో, సమయస్ఫూర్తితో ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేవాడు. క్లిష్టమైన కేసులను కూడా నిమిషాల్లో ఛేదించడంలో బీర్బల్ దిట్ట. అటువంటి ఒక ఆసక్తికరమైన కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి వర్షకాలంలో భారీ వర్షాల వల్ల యమునా నది ఉధృతంగా ప్రవహించి పొంగిపొర్లింది. నది తీరాన ఉన్న అక్బర్ భవనంలోకి రాత్రి వేళ నది ప్రవాహ శబ్దం చాలా గట్టిగా వినిపించసాగింది. ఆ సన్నాటంలో అక్బర్‌కు ఆ హోరు నది ఏడుస్తున్నట్లుగా అనిపించి, నిద్ర పట్టలేదు. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఆలోచించినా ప్రశాంతత లభించలేదు. ఆ మరుసటి రోజు ఉదయం దర్బార్ సమావేశమవ్వగానే అక్బర్ సభికులను ఉద్దేశించి, రాత్రి యమునా నది తీవ్రంగా ఏడుస్తోంది. మీలో ఎవరైనా నదికి వచ్చిన కష్టమేమిటో చెప్పగలరా? అని ప్రశ్నించాడు. ఆ విచిత్రమైన ప్రశ్నకు సభికులంతా తెల్లబోయి, సమాధానం తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మిన్నకుండిపోయారు.

అప్పుడు బీర్బల్ ముందుకు వచ్చి, మహారాజా! ఆ శబ్దాన్ని నేను స్వయంగా వింటే కానీ కారణం చెప్పలేను అని విన్నవించాడు. దాంతో అక్బర్ ఆ రాత్రికి బీర్బల్‌ను అంతఃపురానికి ఆహ్వానించాడు. రాత్రి వేళ అక్బర్ గదిలోని కిటికీ వద్ద నిలబడి నది హోరును శ్రద్ధగా విన్న బీర్బల్‌కు అంతరార్థం అర్థమైంది. మరుసటి రోజు సభలో బీర్బల్ ఎంతో భావోద్వేగంతో విశ్లేషించాడు.

ఇవి కూడా చదవండి

మహారాజా! యమునా నది తన పుట్టిల్లయిన హిమాలయ పర్వతాలను వదిలి, తన అత్తవారిల్లయిన సముద్రం వైపు ప్రయాణిస్తోంది. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రిని, పుట్టింటిని విడిచి వెళ్లాల్సి వస్తోందన్న దిగులుతో, వియోగ బాధను తట్టుకోలేక ఏడుస్తోంది అని చెప్పాడు.

బీర్బల్ ఇచ్చిన ఈ సమాధానానికి సభికులంతా ఊపిరి పీల్చుకోగా, అక్బర్ బాద్‌షా అతని అంతరార్థాన్ని, సృజనాత్మకతను ఎంతో మెచ్చుకున్నాడు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..