ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకే తగ్గిపోయిందా?

ఒక కుటుంబం ఆస్పత్రి బిల్లుల మోసానికి AIని ఆయుధంగా ఉపయోగించింది. రూ.78 లక్షల భారీ బిల్లును AI సహాయంతో రూ.21 లక్షలకు తగ్గించుకుంది. AI సాఫ్ట్‌వేర్‌లో బిల్లును అప్‌లోడ్ చేయగా, అది తప్పులు, డూప్లికేట్ ఎంట్రీలను గుర్తించి, చట్టబద్ధమైన లేఖను సిద్ధం చేసింది. దీంతో ఆ కుటుంబం రూ.56 లక్షలు ఆదా చేసుకుంది. ఇది అన్యాయమైన వ్యవస్థలపై AI ఎలా పోరాడగలదో చూపిస్తుంది.

ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకే తగ్గిపోయిందా?
Tech Fights Medical Fraud

Updated on: Jan 22, 2026 | 2:36 PM

AI అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. అన్యాయమైన వ్యవస్థలపై పోరాడే ఒక శక్తివంతమైన ఆయుధంగా కూడా పనిచేస్తుంది..ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది. ఒక కుటుంబం ఏఐని వాడుకుని..ఆస్పత్రి అరచకాన్ని ఎదుర్కొన్న తీరు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో చేరిన వ్యక్తి వైద్యం కోసం లక్షల రూపాయల మెడికల్ బిల్లును ఏఐతో తగ్గించుకుంది ఆ కుటుంబం. 10 రోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు రూ.78 లక్షల బిల్ కాగా.. దాన్ని ఏఐ సాయంతో రూ.21 లక్షలకు తగ్గించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు.. 10 రోజుల పాటు ఆస్పత్రిలోనే అడ్మిట్‌ ఉండాల్సి వచ్చింది. దాంతో 10 రోజులకు గానూ ఆస్పత్రి బిల్లు ఏకంగా రూ.78 లక్షలకు చేరింది. బిల్లు చూస్తే భారీగా ఉంది.. కానీ, అందులో తమ వ్యక్తికి ఇచ్చిన ఎలాంటి కొత్త ట్రీట్మెంట్‌ వివరాలు లేవు..దీంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయినప్పటికీ స్మార్ట్‌ ఆలోచించి ..ఏఐ సహాయం తీసుకున్నారు. బిల్లును దాదాపు సగం కంటే తక్కువకు కుదించేసుకున్నారు..

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి ఇచ్చిన ప్రతీ మెడికల్ బిల్లును, ప్రతీ లైన్‌ టూ లైన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేశారు.. మొత్తం మెడికల్ బిల్లును ఆడిట్ చేయమని ఏఐని కోరారు. క్షణాల్లో ఆ బిల్లులోని లోపాలను ఏఐ గుర్తించి బయటపెట్టింది. రకరకాల మందులు, టెస్టుల పేర్లతో లక్షల రూపాయలు అధికంగా బిల్లు వేశారని తేల్చింది. అంతేకాదు.. ఒకేదానికి రెండు రెండు సార్లు కూడా బిల్లు వేశారని గుర్తించింది ఏఐ. ఆ పేషంట్‌కు ఉపయోగించని వస్తువులకు కూడా అధిక ధరలు వేసినట్టుగా ఏఐ తేల్చింది. ఆఖరున చట్టపరమైన నిబంధనలను ప్రస్తావిస్తూ ఏఐ ఒక అధికారిక లేఖను కూడా సిద్ధం చేసి ఇచ్చింది.

అంతే ఏఐ తో ఆ కుటుంబానికి అందిన అస్త్రం ఆ లేఖ.. దాంతో వారు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. దాంతో ఆస్పత్రి యజమాన్యం దిగి రాక తప్పలేదు. ఆ లేటర్‌ మొత్తం చదివి.. బిల్లును మొత్తం పరిశీలించింది. 3 రోజుల తర్వాత సరైన బిల్లును పంపించింది. మొదట రూ.78 లక్షలు వేసిన ఆ మెడికల్ బిల్లును ఏకంగా రూ.21.4 లక్షలకు తగ్గిస్తూ ఫైనల్ బిల్లు ఇచ్చింది. దీంతో ఆ కుటుంబానికి రూ.56 లక్షలు అధికంగా చెల్లించే బాధ తప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..