AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మైకల్‌ జాక్సన్‌ను మించిపోయారు.. పిల్లల స్టెప్పులు చూస్తే మైమరిచిపోవాల్సిందే..

ఈ వీడియో చూసిన తర్వాత ఈ చిన్నారులు చిన్న వయసులో ఇంత చురుగ్గా ఎలా డ్యాన్స్ చేస్తున్నారంటూ మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: మైకల్‌ జాక్సన్‌ను మించిపోయారు.. పిల్లల స్టెప్పులు చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Dance Video
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2022 | 12:44 PM

Share

African Kids amazing dance: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా మందికి సంబంధించిన టాలెంట్ వెలుగులోకి వస్తుంది. వీటిలో పిల్లలకు సంబంధించిన అద్భుతమైన విన్యాసాలు నెటిజన్ల హృదయాలను కట్టిపడేస్తుంటాయి. చాలామంది చిన్నారులు సింగింగ్, డ్యాన్సింగ్ ప్రతిభతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తారు. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో ఆఫ్రికన్ పిల్లల అద్భుతమైన డ్యాన్స్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.. ఈ వీడియో చూసిన తర్వాత ఈ చిన్నారులు చిన్న వయసులో ఇంత చురుగ్గా ఎలా డ్యాన్స్ చేస్తున్నారంటూ మీరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిని చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తూ తెగ ఇష్టపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. కొంతమంది చిన్నపిల్లల చుట్టూ నిలబడి ఉన్నారు. అదే సమయంలో.. ఆఫ్రికన్ పిల్లవాడు అద్భుతమైన డ్యాన్స్‌ స్టేప్స్‌ వేస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ఇది చూస్తే.. ఈ బాలుడు ఎవరో దగ్గర శిక్షణ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇంతలోనే ఇంకో బాలుడు ముందుకు వచ్చి.. స్టేప్పులతో రెచ్చిపోతాడు. ఈ చిన్నారుల డ్యాన్స్ వీడియో చూసి మీరు కూడా జాబ్రా ఫ్యాన్ అవుతారు. ఈ చిన్నారుల డ్యాన్స్‌కి సోషల్ మీడియా జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Pinku (@pinkukumar584)

చిన్నారులు చేసిన ఈ డ్యాన్స్ వీడియో కేవలం కొన్ని సెకన్లే అయినా.. నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను పింకుకుమార్584 అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించి.. దాదాపు 40 లక్షల మంది లైక్ చేశారు. దీంతోపాటు అమెజింగ్‌ డాన్స్‌.. మైకల్ జాక్సన్‌ను మించిపోయారంటూ పిల్లలను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..