ఎంత పెద్ద మనసు తల్లీ..చెత్త కుప్పలో దొరికిన శిశువుకు ఆస్తి రాసిచ్చేందుకు ముందుకొచ్చింది
చెత్తకుప్పలో దొరికిన ఓ మహిళ ముక్కు మోహం తెలియని ఓ శిశువుని చేరదీసింది. అంతేకాదు ఆ చిన్నారికి ఏకంగా తన ఆస్తిలో సగం వాటాను రాసివ్వడానికి ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ జిల్లా జయంతి నగర్ లో లత అనే మహిళ ఉంటోంది.
చెత్తకుప్పలో దొరికిన ఓ మహిళ ముక్కు మోహం తెలియని ఓ శిశువుని చేరదీసింది. అంతేకాదు ఆ చిన్నారికి ఏకంగా తన ఆస్తిలో సగం వాటాను రాసివ్వడానికి ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ జిల్లా జయంతి నగర్ లో లత అనే మహిళ ఉంటోంది. సొమవారం రోజున ఉదయం పాల కోసం రోడ్డుపై వెళ్తోంది. ఈ క్రమంలో ఓ చెత్తకుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. అయితే అక్కడికి వెళ్లి చూడగా ఓ శిశువు కనిపించింది.
దీంతో వెంటనే ఆ బిడ్డను తీసుకుంది. అక్కడ ఉన్న స్థానికులందరిని ఈ బిడ్డ గురించి ఆరా తీసింది. అయితే ఎవరూ కూడా తమకు తెలియదని చెప్పకపోవడంతో చివరికి ఆ పాపను తన ఇంటికి తీసుకెళ్లింది. స్నానం చేయించి, పాలు పట్టించింది. అనంతరం ఆ బిడ్డను దత్తత తీసుకుంది. అలాగే తన పేరు మీద ఉన్న ఆస్తిలో సగం వాటాను రాస్తానని ముందుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు లత పెద్ద మనసును చూసి అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్ కు సమాచారం అందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం