Watch: తలపై ఒకటి కాదు, రెండు గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని ఎంత బాగా డ్యాన్స్ చేసిందో..
ఈ మహిళ పేరు నీతు. ఆమె తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమె చాలా వీడియోలలో తలపై భారంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పంచుకుంటుంది. నీతుకు సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ వీడియోలో ఓ మహిళ రెండు వంటగ్యాస్ సిలిండర్లను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. మీరు ఈ వీడియోని నమ్మరు. కానీ, ఇది నిజం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ చీరలో డ్యాన్స్ చేస్తోంది. ఆమె తలపై రెండు సిలిండర్లు, దానిపై బిందె కూడా ఉంది. ఆమె తలపై ఇంత భారాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. విశేషమేమిటంటే ఆమె తలపై అంత భారం వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించడం. ఆమె ముఖ కవళికలు, డ్యాన్స్ స్టెప్స్ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. పైగా ఆమె నృత్యాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. మీరు చాలా స్టంట్ వీడియోలను చూసి ఉండవచ్చు. కానీ మీరు ఇలాంటి స్టంట్ వీడియోని చూడటం బహుశా ఇదే మొదటిసారి అవుతుంది.
ఈ మహిళ పేరు నీతు. ఆమె తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆమె చాలా వీడియోలలో తలపై భారంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పంచుకుంటుంది. నీతుకు సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు.
View this post on Instagram
ఈ మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా _neetu_5650 నుండి షేర్ చేసింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోకు ప్రతిస్పందించారు. ఒక వినియోగదారు “ఈ మహిళకు ఆస్కార్ ఇవ్వాలి” అని రాశాడు, మరొకరు “మహిళా శక్తికి పెద్ద వందనం” అని రాశారు. “మీరు ఈ సిలిండర్‌ను మీ తలపై ఎలా పెట్టుకోగలిగారు అని అడుగుతున్నారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఈ ప్రతిభను భారతదేశంలో మాత్రమే చూడగం అంటున్నారు. ఇలా చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, కొంతమంది వినియోగదారులు ఈ వీడియోకు మంచి మంచి స్మైలీ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




