గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌ మనదైతే.. ఆట ఇలాగే ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు కచ్చితంగా గుర్తొస్తాయి.

Viral Video: భారతీయులకు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు అంతకు మించి.. క్రికెట్‌ను భారతీయులు తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తుంటారు. మ్యాచ్‌ వస్తుందంటే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇక చిన్నారులు..

గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌ మనదైతే.. ఆట ఇలాగే ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు కచ్చితంగా గుర్తొస్తాయి.
Gully Cricket
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 18, 2021 | 3:38 PM

Viral Video: భారతీయులకు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు అంతకు మించి.. క్రికెట్‌ను భారతీయులు తమ జీవితంలో ఒక భాగంగా భావిస్తుంటారు. మ్యాచ్‌ వస్తుందంటే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇక చిన్నారులు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే బాలు, బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌కు పరుగులు పెడుతుంటారు. ఇప్పుడైతే ఈ స్మార్ట్‌ ఫోన్‌లు, వీడియోగేమ్స్‌ వచ్చాయి కానీ.. ఒక పదేళ్ల క్రితం మాత్రం ఆటలంటే క్రికెటే. సెలవు వచ్చిందంటే చాలు గ్రౌండ్‌లో, గల్లీల్లో క్రికెట్‌ ఆడుతూ సందడి చేస్తుంటారు. అయితే గల్లీల్లో కుర్రాళ్లు ఆడుకునే క్రికెట్‌ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎవరు ముందు బ్యాటింగ్ చేయాలి నుంచి మొదలు ఎలా అవుట్‌ అన్న వరకు అన్నింటికీ కొన్ని నిబంధనలు ఉంటాయి.

అయితే ఆట ఆడే సమయంలో పిల్లలు తొండి ఆట కూడా ఆడుతుంటారు. తాము అవుట్‌ అయితే ఏదో ఒక సిల్లీ రీజన్‌ చెబుతూ అవుట్‌ కాలేదని వాదిస్తుంటారు. ఇక బ్యాట్‌ మనదైతే ఇంకేముంది.. ఒకవేళ మనం అవుట్‌ అయితే. మ్యాచ్ క్యాన్సిల్‌ అయినట్లే.. అవుట్‌ అయిన వెంటనే బ్యాట్‌ను తీసుకొని పరిగెత్తుతాం. ఇలాంటి సంఘటనలు మన చిన్నతనంలో ఒక్కసారైనా చూసే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇలాంటి సంఘటననే గుర్తు చేస్తోంది. కొంతమంది కుర్రాళ్లు కలిసి క్రికెట్‌ ఆడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేస్తున్న కుర్రాడు సగం క్రీజులోకి వచ్చి బంతిని బాదడానికి ప్రయత్నించాడు.. కానీ బంతి మిస్‌ అయ్యి కీపర్‌ చేతులోకి వెళ్లింది. దీంతో స్టంప్‌ చేయడంతో ఆ కుర్రాడు అవుట్‌ అయ్యాడు. అయితే.. ఆ అవుట్‌ను ఒప్పుకోని కుర్రాడు, వికెట్లను గట్టిగా బాది, బ్యాట్‌ తీసుకొని పరిగెత్తాడు. దీంతో మిగతా చిన్నారులంతా.. అతని వెనక పరిగెత్తారు. దీనంతటినీ అక్కడ ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. తాము చిన్నతనంలో ఇలాగే చేసే వాళ్లమంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by fun_ki_life (@fun_ki_life)

Also Read: Lambasingi: పోలీస్ వర్సెస్ లంబసింగి గ్రామస్తులు. గొడవ మొదలైంది. ఇంతకీ ఏంటా రగడ?

Prabhas: ప్రభాస్‌ హవా మాములుగా లేదుగా.. స్పిరిట్‌ కోసం డార్లింగ్‌ ఎన్ని రూ. కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా.?

Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు చేస్తున్న ఓ వ్యక్తి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ ..