Prabhas: ప్రభాస్ హవా మాములుగా లేదుగా.. స్పిరిట్ కోసం డార్లింగ్ ఎన్ని రూ. కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా.?
Prabhas Spirit: బాహుబలి అనే ఒక్క సినిమా ప్రభాస్‌ను ఒక్కసారిగా నేషనల్ హీరోగా మార్చేసింది. అంతకుముందు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టామినా ఈ సినిమాతో ఒక్కసారిగా..
Prabhas Spirit: బాహుబలి అనే ఒక్క సినిమా ప్రభాస్‌ను ఒక్కసారిగా నేషనల్ హీరోగా మార్చేసింది. అంతకుముందు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టామినా ఈ సినిమాతో ఒక్కసారిగా విశ్వవ్యాప్తమైంది. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆ సినిమాపై యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో తెలుగులో పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రభాస్‌ను బాలీవుడ్ ప్రేక్షకులు అక్కడి హీరోల కంటే ఎక్కువ ఆదరిస్తున్నారు. ఇక దర్శక, నిర్మాతలు సైతం పెరిగిన ప్రభాస్ స్టామినాను దృష్టిలో పెట్టుకునే కొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పట్టాలెక్కిన ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. టీ సిరీస్, సందీప్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘స్పిరిట్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ఈ సినిమాకు ఏకంగా రూ. 150 కోట్లు తీసుకోనున్నాడనేది సదరు వార్త సారాంశం. అయితే ఈ వార్తలో నిజం లేదని, కేవలం పుకారు మాత్రమేననే చర్చ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ మార్కెట్ ఆ స్థాయిలో ఉండడం, అందులోనూ ఈ సినిమాను ఆసియాలోని పలు దేశాల్లో విడుదల చేస్తుండడంతో ఈమాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి.
RattleSnakes: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 పాములు.. ఒకే ఇంటిలో.. వింటేనే భయమేస్తుంది కదు..
RattleSnakes: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 పాములు.. ఒకే ఇంటిలో.. వింటేనే భయమేస్తుంది కదు..