నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది.. స్టంట్స్ చేయబోయి.. ఊహించని విధంగా విలవిల్లాడిపోయాడు..
స్టంట్స్ చేయడం చెప్పినంత సులభం కాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అందులో ఎలాంటి పొరపాటు జరిగినా తీవ్ర ఇబ్బందులు తప్పవు. దేశంలో ఇలాంటి స్కిల్స్ కలిగిన వారికి కొదవ లేదు. వారిలో ఉండే ట్యాలెంట్ ను బయటపెట్టేందుకు..

స్టంట్స్ చేయడం చెప్పినంత సులభం కాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అందులో ఎలాంటి పొరపాటు జరిగినా తీవ్ర ఇబ్బందులు తప్పవు. దేశంలో ఇలాంటి స్కిల్స్ కలిగిన వారికి కొదవ లేదు. వారిలో ఉండే ట్యాలెంట్ ను బయటపెట్టేందుకు సోషల్ మీడియాను ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకుంటున్నారు. సెల్ ఫోన్, డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సరదా కోసం స్టంట్స్ చేస్తున్న వారు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం కూడా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఒక వ్యక్తి నిప్పుతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చివరికి అతను ఊహించని ప్రమాదం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సర్కస్ చూడటానికి వెళ్ళినట్లయితే.. అక్కడ ఉన్న వారు నోటి నుంచి నిప్పులు రప్పించడం మీరు చూడవచ్చు. నోటి నుంచి నిప్పు తీసే ట్యాలెంట్ అందరికీ ఉండదు. చిన్న పొరపాటు చేసినా మంటలు అతని ముఖాన్ని కాల్చేసే ప్రమాదం ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నిప్పుతో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ వ్యక్తి నోటిలో పెట్రోలు పోసుకుని నిప్పుతో స్టంట్స్ చేసేందుకు ట్రై చేశాడు. కానీ పెట్రోల్ మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తుంది. నిప్పు ఉన్న కర్ర ముందు దానిని ఊదేందుకు ప్రయత్నించిన వెంటనే అతని నోటికి మంటలు అంటుకున్నాయి. తీవ్ర నొప్పితో కొన్ని సెకన్ల పాటు బాధతో వణికిపోయాడు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అప్పటికి చాలా ఆలస్యం కావడంతో పెట్రోలు మంటలతో నోరు కాలిపోయింది.




View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో అనే ఖాతా ద్వారా వీడియో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ అయింది. వార్తలు రాసే వరకు వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. డేంజర్ స్టంట్స్ చేసేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయాలను రాస్తున్నారు.