ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో నయాగరా (Nayagara) ఒకటి. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ఈ జలపాతం అద్భుతమైనది. 51 మీటర్ల ఎత్తు నుంచి పడే నీరు స్వచ్ఛంగా మెరిసిపోతూ మురిపిస్తూ ఉంటుంది. కాగా భారతదేశంలో అచ్చం...
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో నయాగరా (Nayagara) ఒకటి. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ఈ జలపాతం అద్భుతమైనది. 51 మీటర్ల ఎత్తు నుంచి పడే నీరు స్వచ్ఛంగా మెరిసిపోతూ మురిపిస్తూ ఉంటుంది. కాగా భారతదేశంలో అచ్చం నయాగరా జలపాతాన్ని తలపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ ఇది నయాగరా ఫాల్స్ అని భ్రమ పడుతూ ఉంటారు. వీడియోలో కనిపించే అందమైన జలపాతం జోగ్ (Jog Water Falls) జలపాతం. ఇది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో షరావతి నదిపై ఉంది. ఇది ఆసియాలోనే ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం రెట్టింపు అందాలను సంతరించుకుంటుంది. ప్రకృతి అందాలు అనగానే విదేశాల్లోనే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ భారతదేశంలో కూడా ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి.
This is not Niagara Falls…
This is Jog Falls, located in Shimoga district of Karnataka, India??
జోగ్ జలపాతం అందాలను చూసి విదేశీయులు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. నార్వే దేశానికి చెందిన ఎరిక్ సోల్హీమ్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది నయాగరా జలపాతం కాదు. ఇది కర్ణాటకలోని షిమోగా జిల్లాలో జోగ్ జలపాతం అని రాసుకొచ్చాడు. కేవలం 24 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.8 మిలియన్ల మంది వీక్షించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి