Viral photo: ఈజీనే.. కొంచెం గజిబిజి.. కాస్త ఫోకస్ పెడితే చిరుతను నిమిషంలో కనిపెట్టవచ్చు..
సోషల్ మీడియాలో కొన్ని మెదడుకు మేత లాంటి పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ వైరల్ అవుతుంటాయి. వాటిని కాస్త ఓపికతో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Trending Photo: కొద్దిగా ఫ్రీ టైమ్ దొరికినా, బోర్ కొట్టినా చాలామంది సోషల్ మీడియా(Social Media)లోకి వెళ్లిపోతారు. స్పేస్ ఉన్నా లేకపోయినా.. స్పేస్ తీసుకుని మరీ సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్లు ఉంటారు లెండి. అక్కడ టైమ్ పాస్ చేయడానికి లెక్కకు మించిన కంటెంట్ ఉంటుంది. ఫన్నీ వీడియోలు, క్యూట్ వీడియోలు.. జంతువులు వేటకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. ఈ క్రమంలోనే మెదడుకు మేత పెట్టే అనేక పజిల్స్ సైతం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ కూడా ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడుకోవాలని. సెల్ప్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండేవారు ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేయాలని తహతహలాడుతుంటారు. ఎక్కడ.. ఎలాంటి పజిల్ కనబడినా.. దాని అంతు తేల్చేవరకు అస్సలు విశ్రమించరు. కాగా ఫోటో పజిల్స్ మీ ఐ పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా ఉన్నా, మరికొన్ని మాత్రం సరదా తీర్చేస్తాయ్. గజిబిజిగా ఉండి మనల్ని తికమికపెడతాయి. వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను చీట్ చేస్తాయి. కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది. కాస్త ఫోకస్ పెట్టి చూస్తేనే.. వీటికి సమాధానం పసిగట్టలం. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మంచుకొండల్లో తీసిన ఫోటో. ఆ ఫోటోలో చిరుత ఉంది. అది ఎక్కడ ఉందో మీరు పసిగట్టాలి. ఏదో పైపైన ఆ ఫోటోను చూస్తే దాన్ని కనిపెట్టలేరు. మనసు పెట్టి గమనించాల్సిందే. ఎంతసేపు చూసినా మీకు సమాధనం దొరక్కపోతే మేమే కింద ఇచ్చాం చూసెయ్యండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి