AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నాలుగేళ్లలోపు చిన్నారులకు ఉద్యోగ అవకాశం, జీతంగా ఏం ఇస్తారో తెలుసా.?

Viral News: సాధారణంగా మనదగ్గర నాలుగేళ్లలోపు చిన్నారులు ఏం చేస్తారు.? ఏముంది.. ఎంచక్కా ఆడుకుంటూ, అమ్మనాన్నలతో సరదాగా గడిపేస్తారు అంటారా.? అయితే ఓ సంస్థ మాత్రం నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగ...

Viral News: నాలుగేళ్లలోపు చిన్నారులకు ఉద్యోగ అవకాశం, జీతంగా ఏం ఇస్తారో తెలుసా.?
Narender Vaitla
|

Updated on: Sep 02, 2022 | 1:27 PM

Share

Viral News: సాధారణంగా మనదగ్గర నాలుగేళ్లలోపు చిన్నారులు ఏం చేస్తారు.? ఏముంది.. ఎంచక్కా ఆడుకుంటూ, అమ్మనాన్నలతో సరదాగా గడిపేస్తారు అంటారా.? అయితే ఓ సంస్థ మాత్రం నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. వారికి జీతం సైతం అందిస్తోంది. నాలుగేళ్ల లోపు చిన్నారులు ఉద్యోగం చేయడం ఏంటి.? వారికి జీతం ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా.? ఈ వివరాలు తెలియాంటే మనం జపాన్‌ వరకు వెళ్లి రావాల్సిందే..

జపాన్‌లోని కిటక్యుషులోని ఓ నర్సింగ్‌ హోమ్‌ నాలుగేళ్ల లోపు చిన్నారులను హైర్‌ చేసుకుంటున్నామని ప్రకటన జారీ చేసింది. ఇందుకోసం చిన్నారులకు అవసరమైన ఫుడ్‌, డైపర్స్‌ను జీతంగా అందిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే జపాన్‌లో ఉన్న వృద్ధుల మొహాల్లో చిరునవ్వులు పూయించడానికే. నర్సింగ్ హోమ్‌లో ఉండే వృద్ధులకు కంపెనీ ఇవ్వడానికి చిన్నారులను హైర్‌ చేసుకుంటున్నారు. ఇందులో చేరడానికి పిల్లల వయస్సు నాలుగు సంవత్సరాల లోపే ఉండాలి. వారికి ఇష్టమైన సమయంలో నర్సింగ్‌ హోంకు రావొచ్చు.

అంతేకాకుండా చిన్నారులతో పాటు వారి కేర్‌ టేకర్‌ నర్సింగ్‌ హోమ్‌కు రావొచ్చు. ప్రస్తుతం ఈ నర్సింగ్‌ హోమ్‌లో 80 ఏళ్ల వయసున్న 100 మంది వృద్ధులు ఉన్నారు. ఇప్పటి వరకు 30 మంది చిన్నారులను తీసుకున్నారు. చిన్నారులను చూసిన వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇది వృద్ధుల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ఏది ఏమైనా సొంత మనవళ్లు, మనవరాళ్లతో గడపాల్సిన వాళ్లు ఇలా ఎవరి పిల్లలతో గడపడం ఒకింత ఇబ్బందికరంగానే ఉన్నా ఆ దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..