Viral: కారు డోర్ ఓపెన్ చేయగానే కనిపించింది చూసి స్టన్ అయిన వ్యక్తి.. 200 కిలోమీటర్లు దానితోనే

కారులో పాము కుబుసం కనిపించడంతో.. సుజిత్ కంగుతిన్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కారు అంతా వెతికించాడు. అయితే కారులో పాము మలమూత్రాలు కనిపించాయి కానీ.. స్నేక్ కనిపించలేదు

Viral: కారు డోర్ ఓపెన్ చేయగానే కనిపించింది చూసి స్టన్ అయిన వ్యక్తి.. 200 కిలోమీటర్లు దానితోనే
Car
Follow us

|

Updated on: Sep 02, 2022 | 1:23 PM

Trending: నాగు పాము ఏకంగా కారులోనే నివాసం ఏర్పాటు చేసుకుంది. డైలీ బయటకు వెళ్లి ఆహారం తిని వచ్చి.. ఆ కారులోనే సేదతీరడం అలవాటుగా మారిపోయింది. నెల రోజులుగా ఈ తంతు కొనసాగుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఆ కారుతో పాటు ప్రయాణించింది కూడా. కారులో దాని కుబుసం కనిపించడంతో.. పూర్తి స్థాయిలో వెతక్కా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేరళ(Kerala)లోని కొట్టాయం(Kottayam) అర్పూకర ప్రాతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లిఫ్ట్ ఆపరేటర్ సుజిత్ తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం నెల రోజుల క్రితం అర్పూకర నుంచి నిలంబూరుకు వెళ్లాలనుకున్నారు. వారు అక్కడి నుంచి బయలుదేరబోతుండగా పార్క్ చేసిన కారు సమీపంలో కింగ్ కోబ్రాను గుర్తించారు.  ఎందుకైనా మంచిదని వాహనం మొత్తం వెతక్కా పాము కనిపించలేదు. కానీ వాస్తవానికి ఆ పాము కారులోనే నక్కి ఉంది. అలా అది ఆ కారులో నెల రోజుల్లో దాదాపు  200 కిలోమీటర్లు ప్రయాణించింది. అలా నెల రోజులు గడిచిన తర్వాత కారులో పాము కుబుసం కనిపించడంతో.. సుజిత్ కంగుతిన్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కారు అంతా వెతికించాడు.

అయితే కారులో పాము మలమూత్రాలు కనిపించాయి కానీ.. స్నేక్ కనిపించలేదు. రెండ్రోజుల తర్వాత సుజిత్ పొరుగున ఉన్న కొబ్బరి కాయల కుప్పలో పాము తోక కనిపించింది. అప్రమత్తమైన స్థానికులు దానిని వలతో కప్పి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీశాఖ స్నేక్ క్యాచర్ అభీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పామును రక్షించి అడవిలోకి వదిలిపెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Latest Articles