‘పోతే వెయ్యి.. వస్తే ఇల్లు..’ రియల్ ఎస్టేట్ రంగంలో నయా ట్రెండ్..!
ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని చాల మంది అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. తమ ఇళ్లు, ప్లాట్లను విక్రయించేందుకు కొందరు నయా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న ఆ నయా ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని చాల మంది అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. తమ ఇళ్లు, ప్లాట్లను విక్రయించేందుకు కొందరు నయా ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న ఆ నయా ట్రెండ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
గతంలో పండుగలు, ఉత్సవాల సమయాల్లో మాత్రమే లడ్డూలు, చీరలకు వేలం పాటలు నిర్వహించేవారు. దుకాణాల వద్ద స్కూటీలు, బైక్‌లు లక్కీ డ్రాలు నిర్వహించడం చూశాం. కానీ ఇటీవల రియల్ ఎస్టేట్ గ్రాఫ్ పడిపోవడంతో క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు తమ ఆస్తులను ఎలాగైనా విక్రయించేందుకు వినూత్న ఆలోచన చేస్తున్నారు. ప్లాట్లు, ఇళ్లకు విక్రయించేందుకు లక్కీ డ్రా నయా ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఆస్తులకు సంబంధించి లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000దాకా కూపన్లకు ధర నిర్ణయిస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటుతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో “పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ఇల్లు అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ నయా ట్రెండ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హల్‌చల్ చేస్తోంది.
నల్లగొండలో రూ 999లకే ఇల్లు..!
నల్లగొండ పట్టణంలో డీఈఓ కార్యాలయం సమీపంలో రమేష్ అనే వ్యక్తికి 147 గజాల స్థలంలో ఆరు గదుల ఇల్లు ఉంది. కొద్ది రోజులుగా విక్రయానికి పెట్టినప్పటికీ ఎవరూ రాకపోవడంతో రమేష్ వినూత్న ఆలోచనతో లక్కీ డ్రా పద్ధతిలో ఇల్లు విక్రయానికి పెట్టాడు. 999 రూపాయలకు ఒక్కో కూపన్ ధర గా నిర్ణయించాడు. మొత్తం 3,000 కూపన్లు మాత్రమే విడుదల చేశారు. ఇంటిని చూడాలనుకునే వారు బ్రోచర్ మీద ఉన్న QR ని స్కాన్ చేస్తే ఇంటి లొకేషన్ వివరాలు ఉంటాయి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ఇంటి యజమాని రమేష్ తెలిపారు.
అదృష్టం కలిసి వస్తే ఇల్లు..!
రూ. వెయ్యి పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తే డ్రాలో ఇల్లు గెలుపొందవచ్చనే ఆశతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మూడు నెలల క్రితం రాంబ్రహ్మం తన ఇంటిని విక్రయించేందుకు లక్కీ డ్రాను ఫాలో అయ్యారు. 3,600 మంది రూ.500 చొప్పున కూపన్లు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొన్నారు. అయితే ఆ యజమానికి రూ.18లక్షల ఆదాయం వచ్చింది. 500 రూపాయల కూపన్ కొనుగోలు చేసిన శంకర్ అనే వ్యక్తికి 66 గజాల స్థలం లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్నాడు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నయా ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




