ఆమెకు 38.. అతడికి 19.. గుట్టుగా శారీరిక సంబంధం పెట్టుకున్నారు.. ఆపై తెల్లారేసరికి
తన వయసులో సగం వయసున్న యువకుడితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ విషాదానికి దారితీసింది. 38 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం కోసం పట్టుబట్టడంతో విసిగిపోయిన 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

చిక్కబళ్లాపూర్ చింతామణి తాలూకాలోని మూడచింతలహళ్లి గ్రామంలో 38 ఏళ్ల మహిళ అక్రమ సంబంధం కోసం పదే పదే వేధించడంతో 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నిఖిల్ కుమార్(19)గా గుర్తించారు పోలీసులు. ఆ మహిళ వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
38 ఏళ్ల శారదకు నిఖిల్‌తో అక్రమ సంబంధం ఉందని స్థానికంగా రూమర్స్ హల్చల్ చేసాయి. ఆమె తల్లిదండ్రులు ఈ విషయంపై వ్యతిరేకించినప్పటికీ.. శారద ఆ యువకుడ్ని వదలలేదు. ఆమె తల్లిదండ్రులకు తెలియకుండానే ఆ యువకుడితో బయటకు తీసుకెళ్లడం, అందరూ చూస్తుండగానే అతడితో తిరగడం వంటివి చేసేది. చాలా సంవత్సరాల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ముడచింతల్లి గ్రామంలో నివసించే శారద.. అక్రమ సంబంధం పెట్టుకోవాలని తరచూ నిఖిల్‌ను ఆమె వేధించసాగేది. ప్రస్తుతం చింతామణిలోని కాచహళ్లి సరస్సు సమీపంలో ఒక యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతుడు నిఖిల్ తల్లిదండ్రులు శారదపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతామణి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
