Viral Video: వామ్మో! ఈ పిల్ల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. పాముకు ముద్దులు పెడుతూ..

పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. ఇలా కొన్ని జంతువుల పేర్లు గుర్తొస్తాయి. ఎవరైనా పామును పెంపుడు జంతువుగా...

Viral Video: వామ్మో! ఈ పిల్ల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. పాముకు ముద్దులు పెడుతూ..
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 11, 2022 | 5:40 PM

పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. ఇలా కొన్ని జంతువుల పేర్లు గుర్తొస్తాయి. ఎవరైనా పామును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకుంటారా.? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా.! ఇక్కడొక అమ్మాయి.. ఓ విషపూరితమైన సర్పాన్ని పెంపుడు జంతువుగా పెంచుకుంటోంది. ఏ మాత్రం భయం లేకుండా దానితో గేమ్స్ ఆడుతోంది. అదేంటని అనుకోవద్దు.! అసలు అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి పామును తన కాళ్లకు చుట్టుకుని ఎంచక్కా ఆడుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. ఆ పిల్ల ఏమాత్రం భయం లేకుండా దానిని పట్టుకుంటూ.. మధ్య మధ్యలో ముద్దులు పెడుతుంటుంది. ఇక ఆ పాము కూడా అమ్మాయికి ఏ హాని తలపెట్టదు. చూస్తుంటే.. అదొక పెంపుడు జంతువులా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీనిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

కాగా, ఈ వీడియోను ‘snakemasterexotics’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి..