Viral News: మా ఇంటికి వస్తే మీకు నిరాశ తప్పదు.. సంక్రాంతికి ఊరెళుతూ దొంగలకు వింత ట్విస్ట్ ఇచ్చిన ఓనర్.
సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, కొత్త దుస్తులు, పిండి వంటలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే పండుగ సంబురం మాములుగా లేదు. తెలుగు ఇళ్లన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇక వృత్తి, వ్యాపారం, విద్య ఇలా రకరకాల..
సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, కొత్త దుస్తులు, పిండి వంటలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ సంబురం మాములుగా లేదు. తెలుగు ఇళ్లన్నీ పండుగ శోభను సంతరించుకున్నాయి. ఇక వృత్తి, వ్యాపారం, విద్య ఇలా రకరకాల కారణాలతో పట్టణాలకు వచ్చిన చాలా మంది తిరిగి పల్లె బాట పట్టారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో అయిన వాళ్లతో జరుపుకోవాలని గ్రామాలకు పయణమయ్యారు. మాములు ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. అయితే ప్రజలు పండుగ కోసం పట్టణాలు వదిలిపోతే దొంగలు దీనిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు.
ఇంటిల్లిపాది గ్రామాలకు వెళ్లడం, రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారండంతో దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తుంటారు. సంక్రాంతి పండుగ సమయంలో దొంగతనాలు పెరగడం గమనించే ఉంటాం. దీంతో కొందరు భద్రతా దృష్ట్యా ఇంట్లో ఎవరో ఒకరు ఉండడం లేదా ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే ఓ ఇంటి యజమానికి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. పండక్కి ఊరెళుతూ దొంగలకు ఓ వినూత్న మెసేజ్‌ను ఇచ్చాడు. ఇంటి డోర్‌పై ఓ నోటీసును అంటించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘ మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం… డబ్బు, నగలు తీస్కోని పోతున్నాం. మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి..’ అంటూ ఓ పోస్టర్‌ను డోర్‌కు అతికిచ్చాడు. ఇంటికి వచ్చిన దొంగలకు తమ ఇంట్లో లేమి లేవనే సందేశాన్ని వెరైటీ ఇచ్చాడు. ఈ పోస్టర్‌ను ఫొటో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఇంటి యజమానికి వచ్చిన ఆలోచనకు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే పోలీస్ అధికారులు సైతం ఇప్పటికే ప్రజలను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. సొంతూళ్లకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..