AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. ‘అప్పు అడగరాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్’.. అసలు కథేంటంటే..

జనాల్లో క్రియేటివిటీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక వ్యాపారం చేయాలనుకునే వారు.. తాము చేయబోయే బిజినెస్ కు చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ను...

Trending: ఎలా వస్తాయిరా బాబూ ఇలాంటి ఐడియాలు.. 'అప్పు అడగరాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్'.. అసలు కథేంటంటే..
Fast Food Centre
Ganesh Mudavath
|

Updated on: Jan 15, 2023 | 6:02 AM

Share

జనాల్లో క్రియేటివిటీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక వ్యాపారం చేయాలనుకునే వారు.. తాము చేయబోయే బిజినెస్ కు చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ను మనం చూశాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న ఈ సంప్రదాయం.. ఇప్పుడు మారుమూల గ్రామాలకూ చేరుతోంది. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా హోటల్ నిర్వాహకులు ప్లాన్స్ చేస్తున్నారు. సెకండ్‌ వైఫ్‌, వచ్చితినిపో, రా మావ టిఫిన్‌ చేసేద్దాం వంటి పేర్లు మనకు సుపరిచితమే. మరోవైపు.. గ్రామాల్లోని దుకాణాలు, హోటళ్లలో చాలా మంది అప్పు చేస్తుంటారు. కడుపు నిండా తినేసి తర్వాత డబ్బులు ఇస్తామని నెమ్మదిగా జారుకుంటారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు అప్పు అడగరాదు అని బోర్డులు పెడుతుంటారు. అయితే.. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు అంటారా.. ఆగండాగండి.. అక్కడే వస్తున్నాను.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందనేది కరెక్ట్ గా తెలియనప్పటికీ.. తెలుగులో రాసి ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందినదని తెలుస్తోంది. ఈ ఫొటోలో.. ఓ దుకాణం గోడపై అప్పు అడగరాదు అని రాసి ఉంది. దాని కిందే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని రాసి ఉంది. అయితే.. ఈ రెండింటికీ మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో ఈ రెండు వాక్యాలు కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి. అంటే.. ‘అప్పు అడగరాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్’ అన్నమాట.

వాస్తవానికి ఆ రెండూ వేరు వేరు వాక్యాలు అయినప్పటికీ.. ఆ రెండూ కలిసిపోయి ఓ కొత్త వాక్యంగా ఏర్పడ్డాయి. దీంతో కొత్తగా అనిపిస్తుంది. ఇక ఔత్సాహికులు ఊరుకుంటారా. వెంటనే కెమెరా క్లిక్ మనిపించి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేశారు. దీంతో అది క్షణంలో వైరల్ గా మారింది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..