Telugu News Trending A funny video of a man coming out of a garbage can has gone viral on social media Telugu viral News
Viral Video: రోడ్డు పక్కన చెత్త సంచి.. తీద్దామని చేయి పడితే ఊహించని షాక్.. భయంతో పరుగులు
సోషల్ మీడియాలో (Social Media) ఫ్రాంక్ వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను చాలా నవ్విస్తాయి. అంతే కాకుండా ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని మాత్రం కోపం తెప్పిస్తాయి. మరికొన్ని భయం కలిగిస్తాయి. మీరు సోషల్...
సోషల్ మీడియాలో (Social Media) ఫ్రాంక్ వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను చాలా నవ్విస్తాయి. అంతే కాకుండా ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని మాత్రం కోపం తెప్పిస్తాయి. మరికొన్ని భయం కలిగిస్తాయి. మీరు సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు చాలానే చూసి ఉంటారు. అందులో కొంత మంది వ్యక్తులు చేసే వింత చర్యలు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని భయంతో పారిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేమని చెప్పవచ్చు. సాధారణంగా ప్రతి పట్టణాల్లో చెత్త సేకరించే బండ్లు ఉంటాయి. అంతే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి వీధిలో తిరుగుతూ చెత్తకుండీలో ఉండే చెత్తను సేకరిస్తారు. సరిగ్గా అప్పుడే ఓ ఫన్నీ (Funny Video) ఇన్సిడెంట్ జరిగింది. ఓ వ్యక్తి చెత్త కుండీలో కూర్చుంటాడు. అతను తనపై ఓ కవర్ ను కప్పుకుని అచ్చం చెత్త సంచిలా కప్పుకుంటాడు. ఈ క్రమంలో ఓ చెత్త లారీ వచ్చింది. అందులో నుంచి ఇద్దరు కార్మికులు దిగి రోడ్డు పక్కన పడి ఉన్న చెత్త సంచిని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. వారు కుండీలో చెయ్యి పట్టగానే అందులో నుంచి ఒకరు హఠాత్తుగా బయటకు వచ్చారు. అది చూసిన కార్మికులు భయంతో వణికిపోయారు. అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ది వరల్డ్ ఆఫ్ ఫన్నీ అనే ఐడీతో భాగస్వామ్యం అయింది. 11 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వీక్షించగా, 18 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్లు ఇస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోలు హాస్యం కలిగిస్తున్నప్పటికీ ఇలా చేయడం సరికాదని, అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు.