Viral: ఓవైపు పెళ్లి తంతు.. మరోవైపు వధువు చేసిన పనికి నవ్వులే నవ్వులు.

అందుకే వివాహం తంతు మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు బిక్కుబిక్కుమని ఉంటుంటారు. ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. అయితే తాజాగా ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓవైపు పెళ్లి భాజాలు, వేద మంత్రాలు కుటుంబ సభ్యుల కోలాహలం నడుమ నూతన వధువు చేసిన పని అందరికీ నవ్వులు తెప్పించింది...

Viral: ఓవైపు పెళ్లి తంతు.. మరోవైపు వధువు చేసిన పనికి నవ్వులే నవ్వులు.
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2024 | 9:06 AM

పెళ్లి అనేది ప్రతీ మనిషి జీవితంలో ఒక కీలక ఘట్టం. అందుకే వీలైనంత వరకు పెళ్లిని ఒక పండుగగా జరుపుకోవాలని అంతా భావిస్తారు. వారి, వారి స్థోమతకు తగ్గట్లుగా పెళ్లిని జరుపుకుంటారు. పెళ్లి అంటేనే ఎన్నో ఎమోషన్స్‌కు నెలవు. ఓవైపు నచ్చిన వ్యక్తిని మనువాడుతున్నానన్న సంతోషం, మరోవైపు పుట్టింటిని వదిలి వెళ్తున్నాన్న బాధ, కొత్తగా వెళ్లే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న భయం. ఇలా రకరకాల ఎమోషన్స్‌ పెళ్లి కూతురును వెంటాడుతుంటాయి.

అందుకే వివాహం తంతు మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు బిక్కుబిక్కుమని ఉంటుంటారు. ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. అయితే తాజాగా ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఓవైపు పెళ్లి భాజాలు, వేద మంత్రాలు కుటుంబ సభ్యుల కోలాహలం నడుమ నూతన వధువు చేసిన పని అందరికీ నవ్వులు తెప్పించింది. ఇంతకీ ఆమె ఏం చేసిందనేగా..

వివాహనానికి సిద్ధమైన జంట పెళ్లి పీటలపై కూర్చుంది. ఇదే సమయంలో పంతులు మంత్రాలు చెబుతున్నారు. మరోవైపు పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అయితే వధువు మాత్రం ఎంచక్కా కునుకు తీస్తుంది. దీంతో పక్కనే ఉన్న వరుడు వెంటనే వధువును కదిలించి నిద్రలేపాడు. దీంతో వధువు నిద్రలోంచి మేల్కొని చిన్న స్మైల్ ఇచ్చింది. ఇదంతా వీడియోలో రికార్డ్‌ అయ్యింది.

వైరల్ వీడియో..

ఇంకేముంది సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేయగానే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ చూసిన నెటిజన్లు మాత్రం నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం రాత్రంతా మేకప్‌ వేసుకోవడంలో బిజీగా ఉంది కాబోలు అంటూ కొందరు కామెంట్స్‌ చేయగా. మరికొందరు స్పందిస్తూ.. ఇది కచ్చితంగా లవ్‌ మ్యారేజ్‌ కావొచ్చు అందుకే వధువు అంతా బిందాస్‌గా ఉంది అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..