AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముందుకు కదిలేందుకు మారాం చేసిన గున్న ఏనుగు.. అది చూసి తల్లి ఏనుగు ఏం చేసిందంటే.. ఇంట్రస్టింగ్ వీడియో మీకోసం..

Viral Video: ఈ మధ్య కాలంలో గున్న ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియో..

Viral Video: ముందుకు కదిలేందుకు మారాం చేసిన గున్న ఏనుగు.. అది చూసి తల్లి ఏనుగు ఏం చేసిందంటే.. ఇంట్రస్టింగ్ వీడియో మీకోసం..
Elephant
Shiva Prajapati
|

Updated on: Aug 16, 2021 | 6:47 AM

Share

Viral Video: ఈ మధ్య కాలంలో గున్న ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియో చాలా ఫన్నీ ఉండటంతో.. నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. ఇలాంటి ఎన్ని వీడియోలు వచ్చినా ఆసక్తికరంగా చూస్తుంటారు. ఈ వీడియోలు చూడటం ద్వారా నెటిజన్లు రిలాక్స్ అవుతుంటారు. తాజాగా ఇలాంటి వైరల్ వీడియోనే ఒక వెలుగు చూసింది. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ గున్న ఏనుగును చూసి మైమరచిపోతున్నారు.

ఈ వీడియో ఓ చిన్నారి ఏనుగు.. తన తల్లి ఏనుగుతో కలిసి నడుస్తోంది. అయితే, ఈ గున్న ఏనుగు మరీ తింగరిదిలా ఉంది. తల్లి ఏనుగును ఆటపట్టిస్తూ ముందుకు కదులుతోంది. ఒక్కోసారి ముందుకు నడవకుండా అక్కడి నిలిచిపోతోందు. ఇక ముందుకు వెళ్లను అన్నట్లుగా సడన్‌గా నిలబడి మారం చేస్తోంది. ఆ తల్లి ఏనుగేమో.. చిన్న ఏనుగును తొండంతో ముందుకు నెడుతోంది. ఇలా ఆ గున్న ఏనుగు ఆగడం.. తల్లి ఏనుగు తన తొండంతో ముందుకు నెట్టడం పరిపాటిగా మారడం ఆ వీడియోలో చూడొచ్చు. ఏదేమైనా.. ఒక తల్లి తన బిడ్డ ప్రతీ కదలను ఎంతో ప్రేమతో చూస్తుందనడానికి దీనిని నిదర్శనంగా చెప్పవచ్చు. తల్లే పిల్లకు తొలి గురువు అవుతుందని.. ఇలాంటి సన్నివేశాల ద్వారా నిరూపితం అవుతుంది. అది జంతువుల్లో అయినా.. మనుషుల్లో అయినా తల్లికి మించింది లేదు.

కాగా, ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్వీట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ పెడుతున్నారు. మానవుడు అయినా, జంతువు అయినా పిల్లలుగా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 వేల మంది దాకా చూశారు. మరి ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: నడి రోడ్డుపై యువతిని ఉరికిస్తూ కొట్టిన మహిళ.. అంతలో పరుగెత్తుకుంటూ వచ్చిన మరో మహిళ.. ఏం చేసిందంటే..

Horoscope Today: ఆ రాశుల వారికి అనుకూల ఫలితాలు.. సోమవారం రాశిఫలాలు..

viral Video: భార్యను ఆటపట్టించిన భర్త.. మూల్యం చెల్లించుకున్న కొడుకు.. ఫన్నీ వీడియో మీకోసం..