Inspiring Story: ఏదైనా పని చేయాలన్నా.. సరికొత్త రికార్డ్ సృష్టించాలన్నా వయసుతో పని ఏముంది.. పట్టుదల చేసే పని నెరవేర్చాలని సంకల్పం ఉంటే చాలు.. “వయస్సు కేవలం ఒక సంఖ్య” అనే సామెత ఉంది. ఈ సామెతను నిజం చేస్తూ.. అనేక మంది వృద్ధులు తమ వయస్సుని లెక్క చేయకుండా లెక్కలేని రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ 75 ఏళ్లకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ( Guinness World Records) పోస్ట్ చేసిన క్లిప్‌లో 75 ఏళ్ల వ్యక్తి తలకిందులుగా నిలబడి.. రికార్డు సృష్టించాడు. స్ఫూర్తిదాయకమైన వీడియో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. అంతేకాదు మనలని కూడా ఏదైనా సాధించాలాంటూ ప్రేరేపించే అవకాశం ఉంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక పేజీలో కొన్ని రోజుల క్రితం వీడియోను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసినప్పటి నుండి.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీడియో ని షేర్ చేస్తూ.. ఈ తలకిందులుగా నిలుచున్నా వ్యక్తి అత్యంత వృద్ధుడు.. వయసు.. 75 ఏళ్ళు.. పేరు.. టోనీ హెలౌ” అని వివరాలను పొందుపరిచారు.
శీర్షాసనం వేయడానికి సిద్ధమయిన ఈ టోనీ బహిరంగం ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు.. ఎటువంటి ఆధారం లేకుండా గాలిలోనే శీర్షాసనం.. ఎంతో సునాయాసంగా వేశారు. తలను నేలమీద పెట్టి.. కాళ్ళను పైకి తీసుకుని గాలిలో పెట్టి.. తలకిందిలుగా నిల్చున్నట్లు వీడియో లో చూపిస్తుంది. .
ఈ వీడియో 8,600 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై కొందరు స్పందిస్తూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. నేను ఇలా తలకిందులుగా నిలుచునే ప్రయత్నం చేశా.. అయితే అప్పుడు తనకు 75 ఏళ్ళు అనిపించింది అని వ్యాఖ్యానించాడు. మరొకరు.. ఇది నిజమైన రికార్డ్ అని ప్రశంసించారు. చాలామంది టోనీ గొప్పదనం అంటూ చప్పట్లు కొడుతూ ఎమోజీలను పోస్టు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..