Viral Video: ఫలించిన కుర్ర జర్నలిస్ట్ కృషి.. దిగొచ్చిన అధికారులు.. వెంటనే యాక్షన్..
Viral Video: సోషల్ మీడియా (Social Media) వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అన్నే లాభాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో సమాచారం అందరికీ చేరుతోంది. ప్రపంచంలో ఏ మూలన..
Viral Video: సోషల్ మీడియా (Social Media) వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అన్నే లాభాలు కూడా ఉన్నాయి. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో సమాచారం అందరికీ చేరుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అందరికీ చేరిపోతోంది. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారం కూడా జరిగిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. ఝార్ఖండ్‌లోని గోడ్డా జిల్లాలోని భిఖియఛక్ గ్రామానికి చెందిన సర్ఫరాజ్ అనే ఓ కుర్రాడు తమ స్కూల్‌లో ఉన్న సమస్యల గురించి వివరిస్తూ.. బుల్లి రిపోర్టర్ అవతారమెత్తాడు. కర్రకు వాటర్ బాటిల్‌ను అమర్చి దానినే మైక్‌గా భావిస్తూ తోటి విద్యార్థిని పాఠశాలలో ఉన్న సమస్యల గురించి అడిగాడు.
‘పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు కూడా లేదు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు విధులకు సరిగా రాకపోవడంతో విద్యార్థులు సక్రమంగా రావడం లేదు. ఇప్పుడు మధ్యాహ్నం 12.45 అవుతున్నా టీచర్లు స్కూల్‌కు రాలేదు’ అని ఆ విద్యార్థుల సంభాషణ సాగింది.. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది.
కుర్ర జర్నలిస్ట్ వీడియో..
అచ్చంగా రిపోర్టర్‌ను పోలినట్లు కుర్రాడు చేసిన విధానానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే వైరల్‌గా మారిన ఈ వీడియో అధికారులను కూడా కదిలిచింది. దీనిపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి రజినీ కుమారి స్పందించారు. వెంటనే పాఠశాలకు సంబంధించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. అక్కడి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..