Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పార్టీ కోసం పబ్‌కొచ్చారు.. సీన్ కట్ చేస్తే.. ఐటీ ఉద్యోగులను చితకబాదిన బౌన్సర్లు.. వైరల్ వీడియో

ఈ దాడికి సంబంధించి సోను, మన్‌దీప్, సుమిత్, నితిన్ రామ్ సింగ్, రాకేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గురుగ్రామ్‌లోని కాన్సా దంజా పబ్ బార్‌కు చెందిన బౌన్సర్లు.

Watch Video: పార్టీ కోసం పబ్‌కొచ్చారు.. సీన్ కట్ చేస్తే.. ఐటీ ఉద్యోగులను చితకబాదిన బౌన్సర్లు.. వైరల్ వీడియో
Pub Bouncer Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 11, 2022 | 5:17 AM

గురుగ్రామ్‌లోని పబ్‌లో ఓ యువతి, ఆమె స్నేహితుడిపై దాడి చేసినందుకుగాను ఇప్పటివరకు ఆరుగురు బౌన్సర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పబ్‌లోని స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన అమ్మాయిని, ఆమె స్నేహితుడిని ఈ బౌన్సర్లు కొట్టారని తెలుస్తోంది. ఆ సమయంలో బౌన్సర్లు అమ్మాయితో ఏదో అనడంతో ఆమె స్నేహితుడు వారిని వ్యతిరేకించాడు. దీంతో ఆగ్రహించిన బౌన్సర్లు వారిపై దాడి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, బౌన్సర్లు అమ్మాయిని, ఆమె స్నేహితుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ దాడికి సంబంధించి సోను, మన్‌దీప్, సుమిత్, నితిన్ రామ్ సింగ్, రాకేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా గురుగ్రామ్‌లోని కాన్సా దంజా పబ్ బార్‌కు చెందిన బౌన్సర్లు.

సమాచారం ప్రకారం, గురుగ్రామ్‌లోని కాన్సా దంజా పబ్‌లో ఒక అమ్మాయి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటోంది. తాను పబ్ బయట నిల్చున్నప్పుడు అక్కడ ఉన్న బౌన్సర్లు తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వేధించేందుకు ప్రయత్నించారని బాలిక ఆరోపించింది. దీంతో బౌన్సర్లను ఆపాలని ఆ యువతి కోరడంతో బాలిక స్నేహితుడిని వారు కొట్టడం ప్రారంభించారు. రక్షించేందుకు వచ్చిన యువతిపై కూడా దాడికి పాల్పడ్డారు.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత అమ్మాయికి చెందిన మరికొందరు స్నేహితులు కూడా బౌన్సర్‌లను ఆపడానికి వచ్చారు. దీని కారణంగా వీరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. ఇది చూసిన పబ్‌లోని అరడజను మందికి పైగా బౌన్సర్లు అక్కడికి చేరుకుని బాలికను, ఆమె స్నేహితులను కొట్టడం ప్రారంభించారు. ఈ గొడవలో యువతి, ఆమె స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి.

పబ్‌లోని బౌన్సర్లు తమపై దాడి చేస్తుండగా, పబ్ నిర్వాహకులు ఎవరూ అడ్డుకోలేదని యువతి, ఆమె స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆ యువకుడి నోటి నుంచి రక్తం వచ్చేలా బౌన్సర్ కొట్టారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో యువతి కేసు నమోదు చేసింది. దీంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇచ్చారు. దీంతో పబ్‌కు చెందిన 6 మంది బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.