Viral Video: ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. కోనసీమ కుర్రాడి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..

|

Aug 30, 2022 | 4:17 PM

తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో తొమ్మిదేళ్ల కుర్రాడు అద్భుతమైన ట్యాలెంట్‌తో జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

Viral Video: ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. కోనసీమ కుర్రాడి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా..
Viral
Follow us on

భారతదేశంలో ప్రతిభకు కొదలేదు. ఎంతో ప్రతిభకలిగినవారు సరైన ప్రోత్సాహం, వేదిక లేకపోవడంతో ఎందరో మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోయారు. ఇలాంటివారికి సోషల్‌ మీడియా సరైన వేదికగా నిలిచింది. ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత దేశంలోని మూలమూలల్లో ఉన్న ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఇదంతా సోషల్‌ మీడియా పుణ్యమే అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో తొమ్మిదేళ్ల కుర్రాడు అద్భుతమైన ట్యాలెంట్‌తో జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన 9 ఏళ్ల పెసింగి సచిన్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. తండ్రి వరప్రసాద్ డిగ్రీ చదివి పోటీ పరీక్షలకు ప్రయత్నించి సరైన అవకాశాలు రాకపోవడంతో ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి రెండేళ్ల క్రితం ఇంటికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో తనకున్న అనుభవంతో తన కుమారుడు సచిన్‌కు అప్పుడప్పుడు క్యాలెండర్ లెక్కలు, సుడోకులో శిక్షణ ఇచ్చాడు. అలా తన తండ్రి నుంచి శిక్షణ తీసుకున్న సచిన్ కొత్త ట్రిక్స్ ఉపయోగించి క్యాలెండర్‌లో 16వందల సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరాలలోని ఏ తేదీని అడిగినా క్షణాల్లో గణన చేసి చెప్తూ అబ్బురపరుస్తున్నాడు. వేగంగా క్యూబ్స్ అమరికను అవలీలగా చేసేస్తున్నాడు. మూలకాల ఆవర్తన పట్టికలో 118 మూలకాలను కింది నుంచి పైకి.. పైనుంచి కిందికి ఎలా అడిగినా టకటకా చెప్పేస్తున్నాడు. ఇలా చెప్తున్న పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బుడతడి ప్రతిభను సామాజిక మాధ్యమాల్లో చూసి.. ఫ్లిప్​కార్ట్ సంస్థ చిన్నారి ప్రతిభను ప్రోత్సహిస్తూ జ్ఞాపిక అందించింది. అంతేకాదు.. సచిన్‌ చదువుతున్న పాఠశాల కూడా ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య అందించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా ఆగస్టు 29న ఈ బుడ్డోడు ప్రతిభను చూసిన తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల చాలా ఆశ్చర్యానికి లోనయ్యానని ఇటువంటి విద్యార్థి అంబేడ్కర్ జిల్లాకు తలమానికమని శాలువాతో సన్మానించి ఈ విద్యార్థి మరిన్ని శిఖరాలకు అధిరోహించాలని విద్యార్థిని ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.