Viral Video: ఓర్నీ..గర్ల్ ఫ్రెండ్‌ను మెప్పించేందుకు ఎంతపని చేశాడు.. చివరికి..!
ఉజ్బెకిస్తాన్‌లోని పార్కెంట్‌లోని ఒక ప్రైవేట్ జూలో జూకీపర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి, తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి.. వీడియో తీస్తూ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అయితే, అతని స్టంట్ విషాదకరంగా ముగిసింది. అతను తన జీవితాన్ని కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలుసకుందాం పదండి...
సాధారణంగా లవ్‌లో ఉన్న వారు తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలకు సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వడం, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. వారికి నచ్చిన గిఫ్ట్స్ కొనివ్వడం చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి తన ప్రియురాలి ముందు తన హీరోయిజాన్ని ప్రదర్శించబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా సింహాల బోనులోకి వెళ్లి దురదృష్టవశాత్తు వాటికి ఆహారమైపోయాడు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్‌లోని ఓ ప్రైవేట్ జూలో ఎఫ్.ఇరిస్కులోవ్ అనే వ్యక్తి జూ కీపర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి విధుల్లో ఉండగా.. గర్ల్‌ఫ్రెండ్‌కు కాల్ చేశాడు. ఆ క్రమంలో ఆమెను మెప్పించడానికి వీడియో తీస్తూ 3 సింహాలు ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి ఎంటరయ్యాడు. పడుకున్న సింహాలు అతడి జోలికి వెళ్లలేదు. అంతటితో సైలెంట్‌గా బయటకు వస్తే ఏ సమస్యా ఉండకపోయేది. కానీ అతను ఓ సింహాన్ని.. సింబా.. నిశ్శబ్దంగా ఉండూ అంటూ దానితో పోటుగాడిలా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంతే మనిషి గొంతు వినగానే సింహాలు ఒక్క ఉదుటన లేచాయి. అతనిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. దీంతో ఇరిస్కులోవ్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన డిసెంబరు 17న జరిగినట్లు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఇరిస్కులోవ్‌ను చంపిన అనంతరం మూడు సింహాలు బోనులో నుంచి బయటకు వచ్చి జూ ప్రాంగణంలో తిరిగాయని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..