AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: శృతిమించిన బైక్‌ రేస్‌.. SUVని ఢీకొట్టి పేలిపోయిన బైక్‌.. ఇద్దరు యువకులు సజీవదహనం

సంఘటనా స్థలంలో ఒక ఎస్‌యూవీ మలుపు తిరిగింది. అంతలోనే ఒక బైకర్‌ ఆ వాహనం ముందు నుంచి దూసుకుపోయాడు. దాని వెనుక వేగంగా వచ్చిన మరో బైక్‌ ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి పెద్ద పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆ బైక్‌ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న మరో వ్యక్తి మంటల్లో కాలిపోయారు.

Watch: శృతిమించిన బైక్‌ రేస్‌.. SUVని ఢీకొట్టి పేలిపోయిన బైక్‌.. ఇద్దరు యువకులు సజీవదహనం
Bike Blasts
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2024 | 7:44 AM

Share

యువతలో బైక్‌ రేస్‌ పిచ్చి శృతిమించుతోంది. రోజురోజుకి బైక్ రైడర్స్ రోడ్లపై రెచ్చిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు బైకులు తీసుకొని ఏకంగా రోడ్ల మీదకి వచ్చి తెల్లవారు జాము వరకు బైక్ రేసింగ్‌లు చేస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారితో పాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదకరంగా బైక్‌ నడుపుతూ ఇద్దరు బైకర్లు దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బైకర్లు దుర్మరణం చెందిన విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. షాకింగ్ ఘటన కెమెరాలో చిక్కుకోగా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో, వేగంగా వస్తున్న బైక్ మార్గమధ్యంలో ఎస్‌యూవీని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్‌ 11న అర్ధరాత్రి వేళ కొందరు బైకర్లు రేసింగ్‌ పోటీలు నిర్వహించినట్టుగా వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

సమాచారం మేరకు.. ఈ సంఘటన శుక్రవారం (అక్టోబర్ 11) ఉదయం 12 గంటలకు హుగ్లీలోని పోల్‌బార్ రాజ్‌ఘాట్ ఇంటర్‌సెక్షన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలంలో ఒక ఎస్‌యూవీ మలుపు తిరిగింది. అంతలోనే ఒక బైకర్‌ ఆ వాహనం ముందు నుంచి దూసుకుపోయాడు. దాని వెనుక వేగంగా వచ్చిన మరో బైక్‌ ఆ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి పెద్ద పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆ బైక్‌ నడిపిన వ్యక్తి, వెనుక కూర్చున్న మరో వ్యక్తి మంటల్లో కాలిపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని పక్కకు లాగేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కానీ, ఫలితం లేకపోయింది. ఎగిసి పడుతున్న మంటలు అదుపుకాకపోవటంతో వారిద్దరు సజీవ దహనమయ్యారు. బొలెరో వాహనంలో ఉన్న వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..