పిల్లలు ఆడుకునేటప్పుడు తమ చేతిలో ఉన్న వస్తువులను నోటిలో పెట్టుకోవడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం.. ఒకొక్కసారి అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు పొరపాటున నేరుగా పిల్లల కడుపులోకి చేరుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఒకొక్కసారి చిన్న పిల్లలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉత్నరు. వెంటనే పిల్లల్ని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లి.. తగిన చికిత్స ఇప్పిస్తారు. ఒకొక్కసారి పిల్లలకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఒక్కోసారి పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. అందుకనే ముందస్తు జాగ్రత్తగా పిల్లలు ఆడుకునే సమయంలో ఇచ్చే వస్తువు పట్ల.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు వస్తువులను పిల్లల నోట్లో పెట్టుకోకుండా దూరంగా ఉంచాలని చెబుతూ ఉంటారు. అయినా సరే.. ఒకొక్కసారి పిల్లలు నోటిలో నాణేలు వగైరా పెట్టుకోవడం తర్వాత ఇబ్బంది పడడం మీరు చూసి ఉంటారు. అయితే కొన్ని సార్లు దీనికి సంబంధించిన వింత కేసులు కూడా వెలుగులోకి వచ్చి షాక్ ఇస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగామారింది, దీని గురించి మీకు తెలిసినా షాక్ తింటారు. వాస్తవానికి ఈ ఘటన టర్కీలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొంతమంది వైద్యులు 15 ఏళ్ల బాలుడి కడుపు నుండి 3 అడుగుల పొడవైన ఛార్జింగ్ కేబుల్‌ను తొలగించారు. టర్కీ పోస్ట్‌ల నివేదిక ప్రకారం.. వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న ఓ బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు. తమ కొడుకు ఎందుకు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అనేది కుటుంబసభ్యులకు అర్థంకాలేదు. దీంతో బాలుడికి పరీక్ష చేసిన వైద్యులు ఎక్స్‌రే తీయాలని సూచించారు. ఎక్స్‌రే తీయడంతో మొత్తం విషయం తేలిపోయింది. నివేదికలో.. అతని కడుపులో ఛార్జింగ్ కేబుల్ ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు. వెంటనే హడావుడిగా డాక్టర్లు పొత్తికడుపుకు శస్త్ర చికిత్స చేసి.. కడుపులోంచి కేబుల్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు.
నివేదికల ప్రకారం.. వైద్యులు శస్త్రచికిత్స చేసి.. పిల్లాడి కడుపు నుంచి .. ఛార్జింగ్ కేబుల్‌తో పాటు కడుపు నుండి హెయిర్‌పిన్‌ను కూడా తొలగించారు. అయితే ఛార్జింగ్ కేబుల్ లాంటి పెద్ద వస్తువు బాలుడి కడుపులోకి ఎలా వెళ్లిందో ఇప్పటి వరకు తెలిలేదని చెప్పారు.
ఇంతటి విచిత్రమైన కేసు మన దేశంలో కూడా గతంలో బయపడింది. కొన్ని సంవత్సరాల క్రితం, అస్సాంలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు.. ఆ తర్వాత యువకుడి కడుపులో హెడ్‌ఫోన్ ఉందని ఎక్స్-రేలో కనుగొనబడింది. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా అతని కడుపు నుండి హెడ్‌ఫోన్స్ ను విజయవంతంగా తొలగించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..