Sankranti special Food Items: సంక్రాంతి పండుగ వేళ చేసుకునే వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత..

సంక్రాంతి సంబరాలతో పల్లెలు ,పట్టణాలు కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలే. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే అరిసెలు, బూరెలు, గారెలు, ..

  • Surya Kala
  • Publish Date - 1:35 pm, Thu, 14 January 21
Sankranti special Food Items: సంక్రాంతి పండుగ వేళ చేసుకునే వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత..

Sankranti special food Items: సంక్రాంతి సంబరాలతో పల్లెలు ,పట్టణాలు కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలే. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే అరిసెలు, బూరెలు, గారెలు, బొబ్బట్లు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు, పూతరేకులు, కజ్జికాయలు, జంతికలు, అప్పడాలు ఇలా ఒక్కో ఇంట్లో నాలుగైదు రకాల పిండివంటలు సిద్ధమవుతున్నాయు. ఇక కొత్తబట్టల సంగతి సరేసరే., ఏడాదంతా సంక్రాంతికి వేసుకునే కొత్తబట్టల గురించే ఆలోచిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో ఎక్కువగా ఏమేం చేస్తారో ఇప్పుడు చూద్దాం.. సకినాలు, జంతికలు, నువ్వుల ఉండలు, సున్ని ఉండలు.. ప్రాంతాలను బట్టి చాలా మంది ఇతర వంటలను కూడా చేస్తుంటారు. కానీ, వీటినే ఎక్కువమంది చేసుకుంటారు. అయితే, ఈ వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత ఉంది.

సున్నుండలు..

మినుములతో చేసే సున్నుండలు ఎంతో బలాన్ని ఇస్తాయి. వీటిని తింటే వెంటనే మంచి బలం వస్తుందని పెద్దలు చెబుతారు. ఇందులో ఉపయోగించే మినపప్పు తో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి, కనుక వీటిని ఈ సీజనల్ లో తింటే ఆరోగ్యానికి మంచిది అని చెబుతారు. మోడ్రన్ లైఫ్‌కి అలవాటు పడిన వారు మన వంటలు, వాటిలోని పోషకాలను తెలుసుకోవడం లేదు. అందుకే చాలా మంది స్వీట్స్, కేక్స్ అంటూ వాటి చుట్టూ తిరుగుతున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎక్కువగా ఊబకాయం, ఇతర సమస్యల బారిన పడుతునున్నారు

నువ్వుల ఉండలు..

నువ్వులు ఉండలు.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా ఇవి చలికాలంలో తీసుకోవడం చాలా మంచిది. అదే విధంగా, బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఈ స్నాక్ ఐటెమ్ ఎంతో బాగుంటుంది.

కొబ్బరి బూరెలు..

అరిసెల తరవాత అంతటి మధురమైన రుచిని అందించే వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, నువ్వుల పిండి, బెల్లం వాడతారు. పాకం పట్టేందుకు కొంతమంది పంచదార వాడతారు. పంచదార అయితే శక్తిని అందించి వెంటనే వదిలేస్తుంది. అదే బెల్లం అయితే మనిషికి దీర్ఘకాలంపాటు శక్తిని ఇచ్చేందుకు దోహదపడుతుంది. అందువల్ల బెల్లాన్ని వినియోగించడమే మంచిది. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి.

కజ్జికాయలు..

పండగకు ఎన్ని వంటకాలు వండుకున్నా తప్పనిసరిగా కజ్జికాయలూ వండుతారు. ఎందుకంటే దీర్ఘకాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అందుకే ‘పండగకు ఏం పప్పలు వండుతున్నారక్కా అంటే అరిసెలు, కజ్జికాయలు, కాసిని జంతికలు వండా’ అంటూ పల్లెల్లో మహిళలు చెప్పుకుంటుంటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదారతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి వినియోగిస్తారు. మనిషికి కావాల్సిన ప్రోటీన్స్‌, ఐరన్‌, ఖనిజ లవణాలు అందుతాయి.

గారెలు :

మాంసాహారం తినే వారు వేడివేడి గారెల్లో నాటు కోడిమాంసం వేసుకుని కనుమ రోజున కుటుంబ సభ్యులతో విందు భోజనం ఆరగిస్తారు. శాకాహార ప్రియులు గారెలుఆవడలు గా తినడానికి ఇష్టపడతారు. ఈ గారెలు కేవలం రుచిలోనే కాదు పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో పుష్కలంగా మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులతోపాటు అనేక రకాల ప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.

Also Read: తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టు పోటీలు మధురై జిల్లాలో ప్రారంభం..