మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్
భారతదేశంలోని ప్రముఖ అసెట్ మ్యానేజ్మెంట్ సంస్థల్లో మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్(Mirae Asset MF) కూడా ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన మిరాయ్ అసెట్ కంపెనీ.. భారతదేశంలో 2008 నుంచి మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్‌ని నిర్వహిస్తోంది. మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన అన్ని విభాగాలు, ఐటీఎఫ్ పథకాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఈ సంస్థ మదుపర్ల నమ్మకాన్ని పొందింది. ఈక్విటి ఫండ్‌లు, మల్టీక్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ తదితర విభాగాల ఫండ్‌లను కూడా మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తోంది. మొత్తం రూ. లక్ష కోట్లకు పైగా మొత్తంలో పెట్టుబడులను ఇది నిర్వహిస్తుండటం విశేషం.
వివిధ ఫండ్స్‌కు సంబంధించి మదుపర్లలో అవగాహన కలిగించేందుకు మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్‌తో కలిసి మనీ9 ప్రత్యేక సిరీస్ నడుపుతోంది. వీడియోల ద్వారా సామాన్య మదుపర్లకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈటీఎఫ్ అంటే ఏంటి? ఈటీఎఫ్ ఎలా పనిచేస్తుంది? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వీటిని ఎలా విక్రయించాలో ఈ వీడియోలు అవగాహన కల్పిస్తాయి. సరైన అవగాహన ఉంటేనే మదుపర్లు సరైన చోట పెట్టుబడి పెట్టగలరు.