తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పట్టపగలు వీధికుక్కలు పసిపిల్లలపై దాడులుచేసి చంపేస్తుంటే, బీఆర్‌ఎస్ గూండాలు వీధికుక్కల్లా విపక్షాలపై పడి ఎటాక్స్ చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అస్సలు లా అండ్ ఆర్డర్ లేనే లేదన్నారు షర్మిల. కేసీఆర్ ఒక నియంతలా పాలిస్తున్నారని, ఆయనకు మహిళలంటే గౌరవం లేదన్నారు. తెలంగాణలో ఏ వర్గానికీ రక్షణ లేకుండా పోయిందని, అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరా? గొంతు నొక్కేస్తారా అంటూ ప్రశ్నించారు షర్మిల. తన వాదనతో గవర్నర్ ఏకీభవించారని, త్వరలో రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పారన్నారు వైఎస్ షర్మిల.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు వీధికుక్కల్లా ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని.. ఫ్రెండ్లీ పోలీస్ ఎవరి కోసమంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న షర్మిల.. వివిధ సమస్యలపై గవర్నర్ తమిలిసైని కలిసి ఫిర్యాదు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..