
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఇటీవల టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ విషయం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని దూషిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నరేందర్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు సెక్షన్ 505(2),504 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..