YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు

|

May 14, 2021 | 7:47 PM

YSSR Team : తెలంగాణలో కరోనా కాటుకు బలై మగదిక్కు కోల్పోయిన మహిళలకు వైయస్ షర్మిల ఆసరా ఉండేందుకు నడుం బిగించారు...

YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, ఆపదలో తోడుగా YSSR టీం ఏర్పాటు
Ys Sharmila
Follow us on

YSSR Team : తెలంగాణలో కరోనా కాటుకు బలై మగదిక్కు కోల్పోయిన మహిళలకు వైయస్ షర్మిల ఆసరా ఉండేందుకు నడుం బిగించారు. “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్న షర్మిల.. కరోనా కారణంగా జీవిత భాగస్వాములను, కన్నబిడ్డలను, అయినవారిని కోల్పోయిన మహిళలకు ఆసరాగా నిలుస్తానని ప్రకటించారు. కరోనా మహమ్మారితో తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది చనిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దదిక్కుగా నిలిచే వారిని కోల్పోయి నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్న మహిళల బాధను కాస్తయినా పంచుకోవాలన్న ఉద్దేశంతో ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఏర్పాటు చేస్తున్నట్టు షర్మిల తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యం కోల్పోరాదని పిలుపునిచ్చిన ఆమె, “మీ కాళ్లపై మీరు నిలబడడానికి, మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నాను. మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులని భావిస్తున్నాను. ఇకపై ‘వైఎస్ఎస్ఆర్ టీమ్’ ఆపదలో మీకు ఉంటుంది. సాయం కావాల్సి వస్తే 040-48213268 ఫోన్ నెంబరుకు సమాచారం అందించండి” అని షర్మిల సూచించారు.

“తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేస్తున్నాను. తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్లీ మీ జీవితం సాఫీగా సాగేందుకు..మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి .. నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నాను” అని షర్మిల సోషల్ మీడియా ముఖంగా విన్నవించారు.

Read also :  Vijayashanti : తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు : విజయశాంతి