YS Sharmila: వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్న నియోజకవర్గం ఇదే.. ఆమే క్లారిటీ ఇచ్చేసింది

| Edited By: Ram Naramaneni

Mar 24, 2021 | 3:28 PM

YS Sharmila: తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్న వైఎస్‌ షర్మిలా.. తాను పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని

YS Sharmila:  వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్న నియోజకవర్గం ఇదే.. ఆమే క్లారిటీ ఇచ్చేసింది
Follow us on

YS Sharmila: తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తున్న వైఎస్‌ షర్మిలా.. తాను పోటీ చేసే స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు షర్మిలా నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు షర్మిల బుధవారం ప్రకటించారు. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలా అంటూ షర్మిలా పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో తమ ప్రభంజనాన్ని ఆపలేరంటూ ఆమె స్పష్టంచేశారు.

ఇదిలాఉంటే.. షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు అనుమతిపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్ 9న షర్మిల ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే.. ఎం చేయాలన్న దానిపై నాయకులు ఆలోచిస్తున్నారు.

అయితే అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొన్ని స్థానాలను గెలిచిన సంగతి తెలిసిందే. ఎంపీతోపాటు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి గెలుపొందారు. అనంతరం వారు అధికార టీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ పోటీ చేస్తే ఎలాంటి వ్యతిరేకత ఉండదని, దీంతోపాటు సామాజిక వర్గం, వైఎస్‌ఆర్‌ అభిమానుల అండదండలు అందే అవకాశం ఉంది. కావున షర్మిలా ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Telangana Assembly Sessions: దేశంలోని వెయ్యి యూనివర్సిటీల్లో బాసర ఐఐఐటీకి 36వ ర్యాంకు: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి