AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రూ. 80 వేల డబ్బుకు వడ్డీతో కలిపి రూ. 1.9 లక్షలు.. సీన్ కట్ చేస్తే.. ఇబ్బందులు మొదలు

లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాళ్ళు చేసే ఆగడాల వల్ల ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లోన్ యాప్ సిబ్బంది ఓవరక్షన్ భరించలేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నడు. 

Telangana: రూ. 80 వేల డబ్బుకు వడ్డీతో కలిపి రూ. 1.9 లక్షలు.. సీన్ కట్ చేస్తే.. ఇబ్బందులు మొదలు
Money
P Shivteja
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 04, 2025 | 1:40 PM

Share

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నివాసముండే సామల శ్రీశైలం(35) అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం లోన్ యాప్‌లో 80 వేల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. అవి కాస్తా వడ్డీతో కలిపి ఒక్క లక్షా 90 వేల రూపాయలు అయ్యాయి. వాటిని వెంటనే కట్టాలని రెండు రోజుల క్రితం లోన్ యాప్ సిబ్బంది ఇంటికి వచ్చారు. వచ్చి శ్రీశైలంను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టారు.

రెండు రోజుల్లో డబ్బు కట్టకుంటే ఇంటి ముందు కూర్చుంటామని బెదిరింపులకు పాల్పడడంతో ఆందోళనకు గురైన శ్రీశైలం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గ్రామ శివారులో పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా అది గమనించిన బంధువులు శ్రీశైలంను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీశైలం మృతి చెందాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ సిబ్బంది వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి మల్లేశం తెలిపారు. లోన్ యాప్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..