AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: టీ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న జీ9.. అసమ్మతితో గాంధీభవన్‌లో హైహీట్.. సీనియర్లకు తోడైన యువనాయకులు..

ఒక్కొక్కరుగా అంతా బయటపడుతున్నారు..! సడెన్‌గా కోవర్టుల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? ఎవరా కోవర్టు.? ఆ తొమ్మిది మంది అసంతృప్త నేతలు.. డైరెక్ట్‌గా.. ఇండైరెక్ట్‌గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? వాళ్లు ఏం చెప్పదలుచుకున్నారు.

Telangana Congress: టీ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న జీ9.. అసమ్మతితో గాంధీభవన్‌లో హైహీట్.. సీనియర్లకు తోడైన యువనాయకులు..
Telangana Congress Party
Sanjay Kasula
|

Updated on: Dec 13, 2022 | 5:48 PM

Share

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సీన్‌ సితారై ..మ్యాటర్‌ హీటెక్కింది..! తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల కుంపట్లు కల్లోలం రేపుతున్నాయి. అది ఇక్కడితో ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే వివాదం మరో మలుపు తిరిగింది. కోవర్టులు అనే అంశం చాలా బలంగా తెరపైకి వచ్చింది. ఒక్కొక్కరుగా అంతా బయటపడుతున్నారు..! సడెన్‌గా కోవర్టుల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? ఎవరా కోవర్టు.? ఆ తొమ్మిది మంది అసంతృప్త నేతలు.. డైరెక్ట్‌గా.. ఇండైరెక్ట్‌గా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? వాళ్లు ఏం చెప్పదలుచుకున్నారు? నెక్స్ట్‌ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్…!!

కాంగ్రెస్‌లో అసమ్మతి కొత్తకాదు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా కామన్..! కానీ ఇప్పుడు చెలరేగుతున్న అసంతృప్తి.. వినిపిస్తున్న గళం.. లేవనెత్తున్న ప్రశ్నలు.. మాత్రం కచ్చితంగా గతంలో కంటే భిన్నంగానే ఉన్నాయి..! అసంతృప్తి సెగలు లావాలా ఎగిసిపడుతున్నాయి. ఇంతకీ ఈ G9 గ్రూప్‌ టార్గెట్ చేస్తున్న ఆ ఒక్కరూ ఎవరు?

పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న లీడర్లు కూడా బలంగా గళం విప్పుతున్నారు. నేరుగా హైకమాండ్‌ను టార్గెట్ చేస్తూ మాటల బాణాలు సంధిస్తున్నారు. పార్టీలోని రాజుకుంటున్న అసమ్మతి తీవ్రతను ఈ పరిణామాలు కచ్చితంగా అద్దం పట్టేవే. గతంలో ఇలాంటి వివాదాలు వచ్చిన సందర్భంలో ఆచితూచి మాట్లాడిన భట్టివిక్రమార్క వంటి నేతలు కూడా ఈ సారి అధిష్టానాన్ని తప్పుపడుతున్నారు.

దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, గీతారెడ్డి, కొండా సురేఖ, వి.హనుమంతరావు, మహేశ్వర్ రెడ్డి, కోదండ రెడ్డి, బెల్లయ్య నాయక్, విష్ణువర్ధన్ రెడ్డి.. ఇలా అసమ్మతి రాగం వినిపిస్తున్న నేతల లిస్ట్ క్రమంగా పెరిగిపోతోంది. ప్రస్తుతానికి ఈ తొమ్మిది మంది. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.

మొత్తానికి హైకమాండ్ అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి. రోజురోజుకి బక్కచిక్కిపోతున్న పార్టీని బలోపేతం చేయడానికి.. పార్టీ శ్రేణులు, నేతల్లో కొత్త జోష్‌ను నింపేందుకు.. జంబో కమిటీలను ప్రకటించింది హైకమాండ్. ఇవి పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతాయి అన్నది పక్కన పెడితే డ్యామేజ్‌ మాత్రం గట్టిగానే జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం