Miyapur Attack: రేపల్లె లవ్‌ స్టోరీకి మియాపూర్‌లో నెత్తుటి మరక.. తల్లి కూతుళ్లపై కత్తితో దాడి.. హాస్పిటల్లో క్రిటికల్‌ కండీషన్‌లో ఆ ముగ్గురు..

వన్‌సైడ్‌ లవ్‌.. మ్యారేజ్‌ ప్రపోజల్‌.. అమ్మాయి ఛీ కొట్టినా.. ఆమె పేరెంట్స్‌ ఛీ పో అన్నా... వెంటపడి వేధించడమే కాకుండా మీసం తిప్పినంత వీజీగా కిడ్నాప్‌ క్రైమ్‌ చిత్రమ్‌...

Miyapur Attack: రేపల్లె లవ్‌ స్టోరీకి మియాపూర్‌లో నెత్తుటి మరక.. తల్లి కూతుళ్లపై కత్తితో దాడి..  హాస్పిటల్లో క్రిటికల్‌ కండీషన్‌లో ఆ ముగ్గురు..
Miyapir Dadi
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 13, 2022 | 6:31 PM

బొంగళూరు స్పోర్ట్స్‌ అకాడెమీలో పరిచయం మొదలు… పెళ్లయిందంటూ కోర్టు నోటీసు.. ఆపై మన్నెగూడలో బీభత్సం..కారులో అటాక్‌..ఆపై పరారీ వరకు నవీన్‌ రెడ్డి నకరాలతో పాటు అతని క్రైమ్‌ కహానీల వరకు రిమాండ్‌ రిపోర్టుకెక్కించారు రాచకొండ పోలీసులు.వైశాలికి మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్‌ జరిపిస్తున్నారని తెలిసే.. పక్కా పథకంతోనే ఈ బీభ్సతం..కిడ్నాప్‌ అని తేల్చారు. కిడ్నాప్‌ ఎపిసోడ్‌ నవీన్‌ వాడిన కారును సీజ్‌ చేశారు. కారుచాటు క్రైమ్‌ సిత్రాలతో పాటు నేడో రోపో మరిన్ని సంచనాలు ఖాయమని తెలుస్తోంది. ఇంతలోనే మియాపూర్‌లో మరో కలకలం.. బ్లడ్‌బాత్‌లో బేసిక్‌ క్రైమ్‌ లైన్‌.. ఎంగేజ్‌మెంట్‌.. మియాపూర్‌ ఆదిత్యనగర్‌లోని ఓ ఫ్లాట్‌లో వైభవి, ఆమె తల్లి శోభపై హత్యాయత్నం. ఏకంగా ఇంట్లోకి వచ్చి తల్లీ కూతురుపై దాడి చేసిన బబ్లూ ఆలియాస్‌ సందీప్‌.. ఆ తరువాత తనూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

స్పాట్‌లో పోలీసులు .. అణువణువూ గాలింపు.. కీలక ఆధారాల సేకరణ

హాస్పిటల్‌లో శోభా.. వైభవి..మరి అతనెక్కడ? హాస్పిటల్లో క్రిటికల్‌ కండీషన్‌లో సందీప్‌‌తోపాటు తల్లీ కూతుళ్లు. నట్టింట్లో ఎందుకీ రక్తపాతం? కూపీలాగితే తెరపైకి లవ్‌ .. బ్రేకప్‌తో పాటు ఎంగేజ్‌మెంట్‌. అది సంగతి. ఔను..వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.పెద్దల అనుమతితో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఫోన్‌ కాల్స్‌.. చాటింగ్‌ నడిచాయి. కానీ సడెన్‌గా కథ మారింది. కారణాలేంటో కానీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. నిశ్చితార్థం క్యాన్సిలయింది. కట్‌ చేస్తే రేపల్లె లవ్‌ స్టోరీకి మియాపూర్‌లో నెత్తుటి మరక. వైభవికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని.. నిశ్చితార్ధానికి కూడా సిద్దమయ్యారని తెలిసి.. సందీప్‌ మరింత పేట్రేగాడు.. ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వడమే కాదు సరాసరి ఇంటికొచ్చాడు.

అసలేం జరిగింది..

మియాపూర్‌లో రక్తంచిమ్మిన రేపల్లె లవ్‌స్టోరీపై 360 డిగ్రీస్‌లో ఫోకస్‌ పెట్టారు పోలీసులు. వైభవికి మరోకరితో ఎంగేజ్‌మెంట్‌ చేస్తున్నారనే తెలిసే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? ఆమె సోదరుడు ఇంట్లోలేని టైమ్‌ చూసి దాడికి తెగపడ్డాడా? తనకు దక్కని వైభవి మరొకరికి దక్కొద్దనే ఉన్మాదంతోనే బరితెగింపా? ఈ టోటల్‌ ఎపిసోడ్‌ వెనుక నిజానిజాలేంటి? అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మన్నెగూడలో నవీన్‌రెడ్డి బరితెగింపు.. మియాపూర్‌లో సందీప్‌ బ్లడ్‌ బాత్‌.. ఈరెండు క్రైమ్స్‌లో కామన్‌ ఎలిమెంట్‌.. ఎంగేజ్‌మెంటే.. నిశ్చితార్ధంలో ఎందుకీ డేంజర్‌ ట్రెండ్‌..! ఎంగేజ్‌మెంట్‌,, ఇలా క్రైమ్స్‌కు గేట్‌ వేగా ఎందుకు మారుతోంది? అనేది చర్చగా మారిందిప్పుడు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం