Hyderabad: మద్యం మత్తులో కార్లు మార్చుకుందామంటూ వేధింపులు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి..!

|

Dec 23, 2021 | 7:53 AM

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌‌లో ఉన్న రోగ్‌ పబ్‌ దగ్గర ఆకతాయిలు రెచ్చిపోయారు. వ్యాలెట్‌ పార్కింగ్‌ చేసిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లు ఎక్స్‌చేంజ్‌..

Hyderabad: మద్యం మత్తులో కార్లు మార్చుకుందామంటూ వేధింపులు.. ఊహించని షాక్ ఇచ్చిన యువతి..!
Pub
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌‌లో ఉన్న రోగ్‌ పబ్‌ దగ్గర ఆకతాయిలు రెచ్చిపోయారు. వ్యాలెట్‌ పార్కింగ్‌ చేసిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లు ఎక్స్‌చేంజ్‌ చేసుకుందామంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. అక్కడే వారిని నిలదీసిన యువతి తన కారు రాగానే వెళ్లిపోయింది. అటు నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ పీఎస్‌ కి వెళ్లి.. ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నగరంలో పబ్బుల దగ్గర ఇలాంటి చేష్టలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీల పేరుతో కొందరు ఫుల్లుగా మద్యం సేవించి రచ్చరచ్చ చేస్తున్నారు. యువతిని వేధించిన యువకులు కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కార్లు ఎక్స్‌చేంజ్‌ చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో.. తీవ్రంగా దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీ ఆధారంగా వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

మరోవైపు.. ఇలాంటి ఘటనల నేపథ్యంలో పబ్బుల నిర్వహణపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు తెల్లవార్లూ మందు సరఫరా చేస్తూ మందుబాబులను రోడ్లమీదకు వదలుతున్నాయనే విమర్శలున్నాయి. అలాంటి పబ్బులను మూసివేయాలని డిమాండ్‌ చేస్తూ పలువురు రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పబ్బుల పట్ల అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు రోగ్‌ పబ్బు దగ్గర కొందరు యువకులు యువతిని ఇబ్బంది పెట్టడంతో పబ్బుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇళ్ల మధ్యే పబ్బులు, అర్ధరాత్రి వరకు డీజేల హోరు చిరాకెత్తిస్తున్న తీరుపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు.. జూబ్లీహిల్స్‌ 10 పబ్‌లకు నోటీసులు జారీ చేసింది‌. ఈనెల 29లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Also read:

GST Returns: జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఈ తప్పు చేస్తే.. చెల్లించక తప్పదు భారీ మూల్యం..

Horoscope Today: ఈ రాశి ఉద్యోగ, వ్యాపార విషయంలో శుభవార్త వింటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Radhe Shyam: హైదరాబాద్‌కు తరలివస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ ఈవెంట్‌కు 40వేల మందికి పైగా..