AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: హైదరాబాద్‌కు తరలివస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ ఈవెంట్‌కు 40వేల మందికి పైగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.

Radhe Shyam: హైదరాబాద్‌కు తరలివస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. 'రాధేశ్యామ్' ఈవెంట్‌కు 40వేల మందికి పైగా..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2021 | 12:07 PM

Share

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. జిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిరియాడికల్ లవ్ డ్రామాగా తెరక్కేక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజహెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తూఉంది. ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం.

ఇక వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కుమార్. ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలి రానున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ కార్యక్రమానికి రానున్నారు. నేడు (23న )న ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుండటంతో ఇప్పటికే అభిమానులు హైదరాబాద్ కు చేరుకున్నారు. 40 వేల మందికి పైగా ఈ ప్రీరిలీ ఈవెంట్ కు రానున్నారని అంచనావేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.  ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి  హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!

Follow Us
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం