ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆమె 17 ఏళ్ల బాలిక.. అతనికి 22 ఏళ్లు.. అతనెవరో ఆమెకు తెలియదు.. ఇమె ఎవరో అతనికి తెలియదు.. ఇద్దరు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అయ్యారు.. ఇద్దరూ డైలీ చాటింగ్ చేసుకునే వారు.. ఇంతలోనే.. తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఒకరోజు ఆమె చదువుతున్న కళాశాల నుంచి అకస్మాత్తుగా మాయమైంది..

ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2025 | 10:00 AM

ఆమె 17 ఏళ్ల బాలిక.. అతనికి 22 ఏళ్లు.. అతనెవరో ఆమెకు తెలియదు.. ఇమె ఎవరో అతనికి తెలియదు.. ఇద్దరు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అయ్యారు.. ఇద్దరూ డైలీ చాటింగ్ చేసుకునే వారు.. ఇంతలోనే.. తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఒకరోజు ఆమె చదువుతున్న కళాశాల నుంచి అకస్మాత్తుగా మాయమైంది.. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆమె ఆచూకీని గుర్తించిన పోలీసులు.. వివరాలు సేకరించారు.. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటన ఆదిలాబాద్‌ పట్టణంలో వెలుగు చూసింది. ఈ ఘటన సంచలనంగా మారింది.

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో విద్యనభ్యసిస్తున్న బాలిక(17)కు సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకులకు చెందిన శివ (22) అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు.. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని శివ బాలికను నమ్మించాడు. కలవాలని చెప్పడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్‌కు వెళ్లి ఆ యువకుడిని కలిసింది.. అనంతరం ఆమెను ప్రలోభపెట్టిన ఆ యువకుడు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అయితే.. బాలిక కళాశాలలో కనిపించకుండా పోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.. ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. దర్యాప్తులో బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆదిలాబాద్‌కు రప్పించారు.. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఆ వాంగ్మూలం తర్వాత బాధితురాలిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.. నిందితుడిపై పోక్సో కేసును నమోదు చేసి అరెస్టు చేశారు.. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపర్చి జిల్లా జైలుకు తరలించినట్లు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కరుణాకర్‌ రావు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..