Arvind Kejriwal: ఇల్లు లేదు.. కారు లేదు.. కేజ్రీవాల్ ఎన్నికల అఫిడవిట్‌లో ఏముందంటే..
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 2023-2024లో ఆయనకు రూ.7.21 లక్షల ఆదాయం సమకూరింది. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.2.5 కోట్లుగా ఉంది.. అందులో రూ.కోటికి పైగా చరాస్తులున్నాయి.. వాటిలో రూ.25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారం, రూ.92వేల విలువైన కేజీ వెండి ఉన్నట్లు వివరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ సెగలు రేపుతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్ వార్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు వ్యూహాలతో ముందుకువెళ్తున్నాయి.. అయితే.. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. హనుమాన్, వాల్మీకి టెంపుల్‌లో పూజల తర్వాత.. పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్రగా వెళ్లి కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలను అందించారు.. ఈ సందర్భంగా తన ఆస్తులను కేజ్రీవాల్ ప్రకటించారు.. తనకు రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని కేజ్రీవాల్ తాజా అఫిడవిట్ లో వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పత్రాల ప్రకారం.. బ్యాంకులో కేజ్రీవాల్‌కు 2.96 లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉంది. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లుగా కేజ్రీవాల్ ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవనే విషయాన్ని నామినేషన్ పత్రాల్లో పొందుపరిచారు.
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 2023-2024లో ఆయనకు రూ.7.21 లక్షల ఆదాయం సమకూరింది. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మొత్తం ఆస్తుల విలువ రూ.2.5 కోట్లుగా ఉంది.. అందులో రూ.కోటికి పైగా చరాస్తులున్నాయి.. వాటిలో రూ.25 లక్షల విలువైన 320 గ్రాముల బంగారం, రూ.92వేల విలువైన కేజీ వెండి ఉన్నట్లు వివరించారు.. సునీతకు గురుగ్రామ్‌లో ఇల్లు, సొంతంగా కారు ఉన్నట్లు తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ.4.23 కోట్లుగా కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే.. 2020లో తన ఆస్తుల విలువ రూ.3.4 కోట్లు అని కేజ్రీవాల్ ప్రకటించారు. 2015లో రూ.2.1 కోట్లు అని తెలిపారు.
ఎవరెవరు పోటీలో ఉన్నారంటే..
కాగా.. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ నామినేషన్ వేశారు. ఇక కాంగ్రెస్ నుంచి బరిలో సందీప్ దీక్షిత్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హాట్ సీట్ రాజకీయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా.. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి.. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి..
ఆప్‌కు ఇండి కూటమిలోని మిత్రపక్షాల మద్దతు..
సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ విచారణకు.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో కేజ్రీవాల్ కు ఓ పక్క ఈడీ కేసు తెరపైకి రావడం.. ఇటు బీజేపీ, కాంగ్రెస్ నుంచి మాటల దాడి తీవ్రమైన నేపథ్యంలో 4వ సారి ఆప్ సర్కార్‌ను ఏర్పాటు చేయడం కేజ్రీవాల్‌కి సవాల్‌గానే మారింది. ఐతే.. ఈ ఎన్నికల్లో తృణముల్ కావచ్చు, సమాజ్‌వాదీ, శరద్ పవార్, మరికొన్ని పార్టీలు ఆప్‌కు మద్దతు పలికడం విశేషం. ఇండీ కూటమిలోని మిత్రపక్షాలు కాంగ్రెస్ కు కాకుండా ఆప్‌కి సపోర్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..