అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. చెదరిన సర్పంచ్ కావాలన్న యువకుడి కల…!

అతనికి ఇంకా పెళ్లి కాలేదు.. అయితే ఆ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ వల్ల ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చాలని భావించాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) రోజునే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో హడావుడిగా ఆలయంలో ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు.

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. చెదరిన సర్పంచ్ కావాలన్న యువకుడి కల...!
Marriage For Panchayat Election

Edited By:

Updated on: Nov 27, 2025 | 5:34 PM

అతనికి ఇంకా పెళ్లి కాలేదు.. అయితే ఆ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ వల్ల ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చాలని భావించాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) రోజునే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో హడావుడిగా ఆలయంలో ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ దరఖాస్తు చేయడంలో ఆలస్యం కావడంతో ఆమె పేరు ఓటర్ జాబితాలో నమోదు కాలేదు. దీంతో తాను అనుకున్నది ఒక్కటి.. ఇక్కడ జరిగిందొక్కటిగా మారింది..! ఈ అనూహ్య ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ స్ధానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. గ్రామంలో రాజకీయాలపై ఆసక్తి ఉండి అవివాహేతుడైన ముచ్చె శంకర్, ఈ రిజర్వేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె పేరు ఓటర్ జాబితాలో చేర్చాలని భావించాడు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రోజునే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో బుధవారం హడావుడిగా ఓ ఆలయంలో ముచ్చె శంకర్ సదరు మహిళను పెళ్లి చేసుకున్నారు.

కాని దరఖాస్తు చేయడంలో ఆలస్యం కావడంతో ఆమె పేరు ఓటర్ జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఖంగుతిన్న శంకర్‌కు కంగారు ఎక్కువైంది అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. అని నైరాశ్యంలో మునిగాడు శంకర్.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..