కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించలేకపోయాడు.. లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలి!

బెట్టింగ్‌ యాప్స్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై.. అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది. తాజాగా కరీంనగర్‌ జిల్లాలోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బిటెక్‌లో ఫెయిలై ఇంటి వద్ద ఉంటూ పరిక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు లోన్‌ యాప్స్‌కు బలయ్యాడు. లోన్‌ యాప్‌ వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించలేకపోయాడు.. లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడి బలి!
Loan Apps

Edited By:

Updated on: Jun 27, 2025 | 8:42 AM

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో బెట్టింగ్‌ యాప్స్‌ను క్రియేట్‌ చేసి వాటి సెలబ్రెటీస్‌లో ప్రమోట్‌ చేసి ప్రజల్లోకి వదులుతున్నారు. వాటితో ఈజీగా డబ్బు సంసాధించుకోవచ్చు అనకున్న అమాయక జనాలు పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే..ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి రాజయ్య జమ్మికుంట పట్టణంలో టైలరింగ్ పనులు చేస్తుండగా పెద్ద కుమారుడు అభినవ్ హైదరాబాద్‌లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు అఖిలేష్ బిటెక్ పరీక్షలు రాసి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉంది ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.

అయితే గురువారం ఓ ఎగ్జామ్‌ రాసేందుకు అభిలేష్‌ హైదరాబాద్ వెళ్లవలసి ఉండగా.. ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిద్రలేవగానే ఇంట్లో ఫ్యాన్‌కు కొడుకు వేలాడుతూ ఉండడం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు పగులగొట్టి రూమ్‌లోకి వెళ్లి అఖిలేష్‌ను కిందికి దించగా. అయితే అప్పటికే అభిలేష్ మృతి చెందాడు.

తమ్ముడు మృతిచెందిన విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లో ఉంటున్న అన్నయ్య హుటాహుటిన కరీంనగర్‌కు చేరుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన తమ్ముడి మరణానికి లోన్‌, బెట్టింగ్ యాప్స్‌ ఏ కారణమని ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..