Crime news: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. కడుపు మంట తాళలేక రోడ్డుపై పరుగులు తీశాడు.. ఆఖరుకు

చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు వంటివేవీ పట్టించుకోకుండా ఖరీదైన వస్తువులు, వాహనాలు కొనివ్వాలని పట్టుబడుతున్నారు. తమ స్నేహితులకు ఉన్నాయన్న కారణంతో...

Crime news: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. కడుపు మంట తాళలేక రోడ్డుపై పరుగులు తీశాడు.. ఆఖరుకు
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 28, 2022 | 12:54 PM

చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు వంటివేవీ పట్టించుకోకుండా ఖరీదైన వస్తువులు, వాహనాలు కొనివ్వాలని పట్టుబడుతున్నారు. తమ స్నేహితులకు ఉన్నాయన్న కారణంతో తమకూ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులను వేధంపులకు గురి చేస్తున్నారు. అంతే కాకుండా క్షణికావేశంలో ప్రాణాలు(Suicide) తీస్తున్నారు. తీసుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కారు కొనివ్వలేదన్న కారణంతో ఓ యువకుడు యాసిడ్(Acid) తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జగిత్యాల (Jagtial) జిల్లా కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన అంజయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. అంజయ్య గీత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉపాధి కోసం పెద్ద కుమారుడు దుబాయి వెళ్లాడు. చిన్న కుమారుడు భానుప్రకాష్‌ ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.

గత కొన్ని రోజులుగా తండ్రిని కారు కొనివ్వాలని అడుగుతున్నాడు. పెద్ద కుమారుడు దుబాయి నుంచి వచ్చిన తరువాత కొనిస్తానని తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొత్త కారు కొనాల్సిందేనంటూ 15 రోజులుగా తల్లిదండ్రులను మరింత పట్టుపడుతూ వచ్చాడు. భానుప్రకాష్ కోరికను ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామశివారులో యాసిడ్‌ తాగాడు. మంటకు తాళలేక అరుస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. గమనించిన స్థానికులు.. జరిగిన విషాన్ని అంజయ్యకు తెలిపారు.

చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గతంలో కూడా సెల్‌ఫోన్‌ కొనివ్వాలని కత్తితో చేయి కొసుకున్నట్లు మృతుడి తండ్రి తెలిపాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read

Viral Video: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

సింహంతో సింగిల్‌గా ఫైట్ చేసిన జీబ్రా !! చివరిలో ఊహించని ట్విస్ట్ !! ఎవరు గెలిచారంటే ??

Viral Video: మొసళ్ల గుంపుతో సింహం జంట భయంకరమైన యుద్దం.. షాకింగ్ వీడియో వైరల్..