AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: అమ్మ తిట్టిందని మనస్తాపం.. అడవిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొడుకు..

ఏ తల్లికయినా తన పిల్లలు అంటే ప్రేమే ఉంటుంది. వారి జీవితం మొత్తం పిల్లల కోసమే.. వారు ఏదయినా తప్పు చేస్తే.. కోపంతో తిడుతారు.. మళ్ళీ ప్రేమతో అక్కున చేర్చుకుంటారు.. కానీ, ఇక్కడ తన తల్లి తిట్టిందని తప్పుగా అర్థం చేసుకొని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

Karimnagar: అమ్మ తిట్టిందని మనస్తాపం.. అడవిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొడుకు..
Death
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 15, 2023 | 9:45 PM

Share

ఏ తల్లికయినా తన పిల్లలు అంటే ప్రేమే ఉంటుంది. వారి జీవితం మొత్తం పిల్లల కోసమే.. వారు ఏదయినా తప్పు చేస్తే.. కోపంతో తిడుతారు.. మళ్ళీ ప్రేమతో అక్కున చేర్చుకుంటారు.. కానీ, ఇక్కడ తన తల్లి తిట్టిందని తప్పుగా అర్థం చేసుకొని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు.. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి కోపంతో మందలించిందని మనస్తాపానికి గురైన బాలుడు.. సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితులకు పంపి, అడవిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొనరావుపేట మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన రాజు, జ్యోతి దంపతుల కుమారుడు దినేష్(17). దినేష్ ఏదో తప్పు చేయగా.. తల్లి మందలించింది. అయితే, తల్లి తనను మందలించడాన్ని తట్టుకోలేకపోయిన దినేష్.. అడవిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు ఊరంతా గాలించారు. ఊరు చివర అడవిలోనూ గాలించగా.. ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది. బోరున విలపించారు. ‘అయ్యో కొడుకా ఎంత పని చేస్తివిరా బిడ్డా నీకోసమేరా మేము పడరాన్ని కష్టాలు పడుతున్నం. ఎంత పని చేస్తేవిరా కొడకా’ అంటూ అడవంతా వినిపించేలా ఆ తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అడవిలో బాలుడి మృతదేహం లభ్యం కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్