పోలీసుల గొప్ప మనసు.. 27 నిమిషాల్లోనే గ్రీన్ ఛానల్ ద్వారా ఊపిరితిత్తులు తరలింపు

ఇటీవల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా గుండెను తరలించడం లాంటి ఘటనలు చూశాం. ఇప్పుడు తాజాగా మరో ఆర్గాన్స్ ను ఒక ప్రాంతం నుంచి వేరే సురక్షితంగా తరలించారు.

పోలీసుల గొప్ప మనసు.. 27 నిమిషాల్లోనే గ్రీన్ ఛానల్ ద్వారా ఊపిరితిత్తులు తరలింపు
Lungs

Updated on: Mar 24, 2023 | 7:21 AM

ఇటీవల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా గుండెను తరలించడం లాంటి ఘటనలు చూశాం. ఇప్పుడు తాజాగా మరో ఆర్గాన్స్ ను ఒక ప్రాంతం నుంచి వేరే సురక్షితంగా తరలించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంం చేసుకుంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ లో భాగంగా శంషాబాద్ విమానశ్రయం నుంచి సికింద్రాబాద్ కు ఊపిరితిత్తులను అంబులెన్స్ లో తీసుకెళ్లారు. ఇది కూడా కేవలం 27 నిమిషాల్లో తలరించినట్లు ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి ఉదయం10.58 గంటలకు లంగ్స్ తో బయలుదేరిన అంబులెన్స్ 11.25 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ కు చేరుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పోలీసులకు దవాఖాన యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 సార్లు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి లైవ్‌ ఆర్గాన్స్‌ తరలించినట్లు సుధీర్ బాబు పేర్కొన్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి