108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడటమే కాదు.. పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి కాన్పు కూడా చేశారు. పసిగుడ్డుకు లోకాన్ని చూపించడంతో మానవత్వాన్ని చాటి చెప్పారు. మంచిర్యాల జిల్లాలో 108 వాహన సిబ్బంది గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఈ ఘటనలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో వాహనం లోనే సుఖ ప్రసవం చేసిన 108 సిబ్బంది తల్లీబిడ్డల్ని రక్షించారు. తమ బిడ్డను కాపాడిన 108 సిబ్బందికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..